Naga Chaitanya-Sobhita: కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
తనకు కాబోయే సతీమణి, నటి శోభితా ధూళిపాళ్లను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హీరో నాగచైతన్య . తన జీవితంలో ఏర్పడిన వెలితిని ఆమె పూర్తి చేస్తుందన్నారు. ఆమెతో జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించేందుకు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నానని తెలిపారు. తమ పెళ్లి చాలా సింపుల్ గా, సంప్రదాయబద్ధంగా జరుగుతుందన్నారు. ఈ వేడుకల్లో ఆర్భాటాలకు తావులేదన్నారు.
పెళ్లిపనులు చాలా వేగంగా జరుగుతున్నాయని, గెస్ట్ లిస్ట్, పెళ్లికి సంబంధించిన ఇతర విషయాలను ఇద్దరం కలిసి నిర్ణయిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ తమ కుటుంబానికి ఎంతో ప్రత్యేకమని, స్టూడియోలోని తాతగారి విగ్రహం ఎదురుగా తమ పెళ్లి జరగనుందని వెల్లడించారు. తాతగారి ఆశీస్సులు తమపై ఎప్పుడూ ఉండాలనే ఉద్దేశంతో ఇరు కుటుంబాలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలిపారు. శోభిత తనను చాలా బాగా అర్థం చేసుకుందన్న చైతన్య.. ఆమెకు తానెంతగానో కనెక్ట్ అయ్యానని తెలిపారు. తన జీవితంలో ఏర్పడిన శూన్యాన్ని శోభిత పూడుస్తుందని నమ్ముతున్నానన్నారు.
నాగచైతన్య – శోభితా ధూళిపాళ్ల వివాహం డిసెంబర్ 4న హైదరాబాద్‌లో జరగనుంది. ఇరు కుటుంబాల పెద్దలు, ఆత్మీయుల సమక్షంలో ఈ వేడుక జరగనుందని టాక్. ఈ పెళ్లి గురించి ఇటీవల నాగార్జున స్పందించారు. కుటుంబసభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు మొత్తం 300 మందిని పిలవాలని అనుకుంటున్నట్టు తెలిపారు. రిసెప్షన్ వివరాలను త్వరలో తెలుపుతామని అన్నారు. నాగచైతన్య ప్రస్తుతం ‘తండేల్’ కోసం వర్క్ చేస్తున్నారు. దీనికి చందు మొండేటి దర్శకుడు. సాయిపల్లవి కథానాయిక. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

