Promotion of electronics: ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీకి ప్రభుత్వం ప్రోత్సాహం.. ఎన్ని కోట్లు అందించనుందంటే?

పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ వస్తువుల వినియోగం విపరీతంగా పెరిగింది. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు ఇలా అన్ని వర్గాల ప్రజలు ఉపయోగిస్తున్నారు. మొబైల్స్ నుంచి ల్యాప్ టాప్ ల వరకూ వివిధ వస్తువుల వినియోగం ఎక్కువైంది. తద్వారా అనేక మంది ఉపాధి కూడా లభిస్తోంది. ఈ నేపథ్యంలో వీటి విడిభాగాల తయారీని ప్రోత్సహించేందుకు, అలాగే చైనా మీద ఆధార పడటాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా వాటిని తయారు చేసే కంపెనీలకు నాలుగు నుంచి ఐదు బిలియన్ డాలర్ల ప్రోత్సాహకాలను అందించనుంది.

Promotion of electronics: ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీకి ప్రభుత్వం ప్రోత్సాహం.. ఎన్ని కోట్లు అందించనుందంటే?
Pli Schemes
Follow us
Srinu

|

Updated on: Nov 25, 2024 | 4:33 PM

ప్రపంచ వ్యాప్తంగా యాపిల్, సామ్సంగ్ తదితర గ్లోబల్ కంపెనీల ఉత్పత్తుల వినియోగం భారీగా పెరుగుతోంది. దానికి అనుగుణంగానే మన దేశంలో కూడా తయారీ ఊపందుకుంది. గత ఆరేళ్లలో దాదాపు రెండింతలు పెరిగి, 2024లో 115 బిలియన్ల డాలర్లకు చేరుకుంది. ఇప్పుడు ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ల సరఫరా దారుగా మారింది. ఈ నేపథ్యంలో మొబైల్ నుంచి ల్యాప్ టాప్ ల వరకూ గాడ్జెట్ ల కోసం స్థానికంగా భాగాలను తయారు చేయడానికి కంపెనీలకు దాదాపు 5 బిలియన్ డాలర్ల ప్రోత్సహకం అందించడానికి చర్యలు చేపట్టింది. ప్రభుత్వం తీసుకున్న ప్రోత్సాహకం నిర్ణయం వెనుక రెండు బలమైన కారణాలున్నాయి. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను పెంచడంతో పాటు చైనా దిగుమతుల మీద ఆధారపడడాన్ని తగ్గించుకోవడం దీని ప్రధాన లక్ష్యాలు. దీని కోసం కొత్త పథకం ద్వారా ప్రోత్సహకాలు అందించనున్నారు.

ముఖ్యంగా సర్క్యూట్ బోర్డు తదితర కీలక భాగాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తారు. తద్వారా దేశంలో తయారైన భాగాల వినియోగం పెరుగుతుంది. వచ్చే రెండు, మూడు నెలల్లో కొత్త పథకం అమల్లోకి వస్తుంది. దాని ద్వారా ప్రోత్సహాకాలు అందుతాయి. దీని ద్వారా అర్హత పొందిన ప్రపంచ లేదా స్థానిక సంస్థలకు నాలుగు నుంచి ఐదు బిలియన్ డాలర్ల ప్రోత్సాహకాలను అందించే అవకాశం ఉంది. కొత్త పథకం అమలు కోసం ఇప్పటికే కార్యాచరణ జరుగుతోంది. ప్రోత్సహాకాలను అందించేందుకు అర్హులను గుర్తించే ప్రక్రియం శరవేగంగా జరుగుతోంది. ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ దీని కోసం ప్రణాళికను రూపొందించింది. కేటాయింపు కూడా ఆ శాఖ ద్వారానే జరుగుతాయి. రాబోయే రెండు, మూడు నెలల్లో కొత్త పథకం తెరమీదకు వచ్చే అవకాశం ఉంది.

దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీని 2030 ఆర్థిక సంవత్సరం నాటికి 500 బిలియన్ల డాలర్లకు పెంచాలన్న లక్ష్యంతోనే కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. దీనిలో 150 బిలియన్ డాలర్ల విడి భాగాల ఉత్పత్తి కూడా ఉంది. కాగా.. 2024 ఆర్థిక సంవత్సరంలో 89.8 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్స్, టెలికం గేర్, ఎలక్ట్రికల్ ఉత్పత్తులను మన దేశం దిగుమతి చేసుకుంది. వీటిలో సగానికి పైగా చైనా, హాంకాంగ్ నుంచి వచ్చినవే కావడం విశేషం. కొత్త పథకం ద్వారా మన దేశంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను పెంచి, దిగుమతులపై ఆధారపడడం తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!