Amazon: ఆ రంగంలోకి అమెజాన్‌ కూడా వచ్చేస్తోంది.. తీవ్రమవుతోన్న పోటీ..

ప్రస్తుతం క్విక్ కామర్స్ సేవలు బాగా విస్తరిస్తున్నాయి. వస్తువును బుక్ చేసుకున్న కొన్ని నిమిషాల వ్యవధిలోనే డెలివరీ చేసే ఈ విధానంపై ప్రజల్లోనూ ఆదరణ లభిస్తోంది. దీంతో దాదాపు అన్ని సంస్థలు ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. తాజాగా ఈ రంగంలోకి అమెజాన్ కూడా అడుగు పెడుతోంది. ఈ దిశగా అడుగులు వేస్తోంది..

Amazon: ఆ రంగంలోకి అమెజాన్‌ కూడా వచ్చేస్తోంది.. తీవ్రమవుతోన్న పోటీ..
Quick Commerce
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 25, 2024 | 2:56 PM

ఈ కామర్స్‌ రంగం ఏ రేంజ్‌లో విస్తరించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతర్జాతీయ కంపెనీలు కూడా ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టాయి. దీంతో అమెరికా నుంచి మొదలు అనకాపల్లి వరకు అన్ని రకాల వస్తువులు డెలివరీ అవుతున్నాయి. అయితే తాజాగా క్విక్‌ కామర్స్‌ రంగానికి సైతం అదే స్థాయిలో ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే బ్లింకిట్‌, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ వంటి సంస్థలు దూసుకుపోతున్నాయి.

వస్తువును బుక్‌ చేసుకున్న క్షణాల్లోనే డెలివరీ చేసే ఈ విధానానికి కస్టమర్లు సైతం పెద్ద ఎత్తున ఇంట్రెస్టింగ్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఫ్యాషన్ సంస్థ మింత్రా సైతం క్విక్‌ కామర్స్‌ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు వార్తలు వచ్చాయి. బెంగళూరులో ప్రయోగాత్మకంగా ఈ సేవలను ప్రారంభించేందుకు మింత్రా సన్నాహాలు చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా మరో ఈ కామర్స్‌ దిగ్గజ సంస్థ అమెజాన్‌ సైతం ఈ కామర్స్ రంగంలోక అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. క్విక్‌ కామర్స్‌ రంగంలో నెలకొన్న పోటీని తట్టుకునే నేపథ్యంలో అమెజాన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి అమెజాన్‌ ఎప్పటి నుంచో ఈ ఆలోచన చేస్తోంది. అయితే ఈ రంగంలో నెలకొన్ పోటీ నేపథ్యంలో ఈ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

‘తేజ్‌’ అనే కోడ్‌ పేరుతో అమెజాన్‌ ఈ సేవలపై అమెజాన్‌ పనిచేస్తోంది. ఇందులో భాగంగానే డార్క్‌ స్టోర్ల ఏర్పాటు, లాజిస్టిక్‌, స్టాక్‌ కీపింగ్‌ యూనిట్ల ఏర్పాటుపై పనిచేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్‌ 9-10 తేదీల్లో ‘సంభవ్‌’ పేరిట నిర్వహించే అమెజాన్‌ వార్షిక సమావేశంలో క్విక్‌ కామర్స్‌ సేవల లాంచింగ్‌కు సంబంధించి కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..