AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: రూ. 5 ఎక్కువ వసూలు చేసినందుకు.. రూ. లక్ష జరిమానా.. వైరల్‌ వీడియో

ఎంఆర్‌పీ ధరల కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేయడం చట్టపరంగా వ్యతిరేకమని తెలిసిందే. అయితే కొందరు ఎక్కువగా వసూలు చేస్తుంటారు. తాజాగా అలాంటి ఓ క్యాటరీంగ్‌ సంస్థపై ఇండియన్‌ రైల్వే తీవ్రంగా స్పందించింది. వాటిర్‌ బాటిల్‌పై రూ. 5 ఎక్కువగా వసూలు చేసినందుకుగాను రూ. లక్ష జరిమానా విధించారు..

Viral: రూ. 5 ఎక్కువ వసూలు చేసినందుకు.. రూ. లక్ష జరిమానా.. వైరల్‌ వీడియో
Viral News
Narender Vaitla
|

Updated on: Nov 25, 2024 | 3:56 PM

Share

ఎంఆర్‌పీ ధర కంటే ఎక్కువ వసూలు చేయడం నేరమనే విషయం తెలిసిందే. ఏ వస్తువుపై కూడా ఎంఆర్‌పీ ధర కంటే ఎక్కువ డిమాండ్‌ చేస్తే సదరు వ్యాపారిపై వినియోగదారుల ఫోరమ్‌లో కేసు నమోదు చేయొచ్చు. మరీ ముఖ్యంగా రైళ్లలో ఇలా అధిక ధరలు వసూలు చేస్తుంటారు. తాజాగా ఇలాగే ఎక్కువ డబ్బులు వసూలు చేసిన ఓ క్యాటరింగ్ సంస్థపై ఇండియన్‌ రైల్వే ఏకంగా రూ. లక్ష జరిమానా విధించారు.

వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి ఇటీవల పూజా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాడు. అదే సమయంలో ఓ వాటర్‌ బాటిల్‌ను కొనుగోలు చేశాడు. క్యాటరింగ్‌ సర్వీస్‌ ద్వారా బాటిల్‌ను కొనుగోలు చేసే క్రమంలో సేల్స్‌ మ్యాన్‌ రూ. 20 డిమాండ్ చేశాడు. నిజానికి ఆ వాటర్‌ బాటిల్‌ అసలు ధర రూ. 15 కాగా.. మిగిలిన రూ. 5 చెల్లించమని కోరగా సేల్స్‌ మ్యాన్స్‌ ఇచ్చేందుకు అంగీకరించలేదు. వాటర్‌ బాటిల్‌ ధర రూ. 20 అని చెప్పుకొచ్చాడు.

దీంతో సేల్స్‌మ్యాన్‌తో జరిగి వాగ్వాదాన్ని ఆ ప్రయాణికుడు స్మార్ట్‌ ఫోన్‌లో రికార్డ్‌ చేశాడు. అంతటితో ఆగకుండా ఇండియన్‌ రైల్వే హెల్ప్‌లైన్‌ నెంబర్ అయిన 139ని కాల్‌ చేసి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేసిన కొద్ది సమయానికే.. క్యాటరింగ్ సర్వీస్ నుంచి ఒక ప్రతినిధి వచ్చి ప్రయాణికుడి నుంచి అధికంగా వసూలు చేసిన రూ.5 తిరిగి చెల్లిస్తానని చెప్పాడు. అయితే కోచ్‌లోని ఇతర ప్రయాణికుల నుంచి వసూలు చేసిన అదనపు మొత్తాన్ని సైతం తిరిగి చెల్లించాలని అభ్యర్థించాడు.

ఇదిలా ఉంటే ఎంఆర్‌పీ కంటే అధిక ధరలు వసూలు చేస్తుండడంపై రైల్వేశాఖ తీవ్రంగా స్పందించింది. ఎక్కువ ధర వసూలు చేసిన సంస్థపై ఇండియన్‌ రైల్వే ఏకంగా రూ. లక్ష జరిమానా విధించినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌ వేదికగా అధికారికంగా తెలిపింది. సదరు వీడియోను షేర్‌ చేస్తూ.. ఇలాంటి ఘటనలపై ఇండియన్‌ రైల్వే కఠినంగా వ్యవహరిస్తుందని అధికారులు తెలిపారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..