LPG Gas: గ్యాస్ సిలిండర్ వాడే వారికి గుడ్‌న్యూస్.. కేంద్రం సరికొత్త నిర్ణయం..!
Piped Cooking Gas: ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ వాడేవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతోంది. ఊరట కలిగించే నిర్ణయం తీసుకోబోతోంది. పైప్డ్..
Piped Cooking Gas: ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ వాడేవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతోంది. వీరికి ఊరట కలిగించే నిర్ణయం త్వరలో తీసుకోబోతోంది. పైప్డ్ ఎల్‌పీజీ గ్యాస్ (Piped LPG Gas) సరఫరా సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది. మోడీ ప్రభుత్వం (Modi Government) పార్లమెంట్లో ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ కొత్త విస్తరణ ప్రణాళికలో భాగంగా భారత భూభాగంలో 82 శాతానికిపైగా ప్రాంతాల్లో పైప్డ్ గ్యాస్ అందుబాటులోకి రానుందని పెట్రోలియం అండ్ సహజ వాయువు మంత్రిత్వ శాఖ మంత్రి హార్థీప్ సింగ్ పూరి ప్రకటించారు.
ఈ సంవత్సరం మే 12వ తేదీన పైప్డ్ గ్యాస్ విస్తరణ పనులకు బిడ్లను ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు. బిడ్డింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కోసం కొంత కాలం సమయం పడుతుందని అన్నారు. 11వ రౌండ్ బిడ్డింగ్ తర్వాత దేశంలో 82 శాతం భూభాగంలో పైప్డ్ గ్యాస్ అందుబాటులోకి వస్తుందని, 98 శాతం మంది దేశ జనాభాకు పైప్డ్ గ్యాస్ అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు. ఈ నిర్ణయంతో చాలా కుటుంబాలకు గ్యాస్ అందుతుందని అభిప్రాయపడ్డారు. ఈశాన్య ప్రాంతం, జమ్మూకశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పైప్డ్ గ్యాస్ అందుబాటులో ఉండకపోవచ్చని ఆయన అన్నారు. అయితే సిలిండర్‌లు సరఫరా చేసే గ్యాస్ కంటే పైప్‌డ్ ఎల్‌పీజీ గ్యాస్ చౌకగా ఉంటుందన్నారు.
ఇవి కూడా చదవండి: