RR IPL Auction 2025: రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసిన ఆటగాళ్ల పూర్తి జాబితా ఇదే..
Rajasthan Royals IPL Auction Players : రాజస్థాన్ రాయల్స్ జట్టుపై చాలా మంది క్రికెట్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. లీగ్ దశలో బాగానే ఆడినప్పటికీ గులాబీ దళం ఫైనల్ చేరలేదు. దీంతో రాజస్థాన్ ట్రోఫీకి దూరమైంది. 2008లో ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన రాజస్థాన్.. ఆ తర్వాత నాలుగుసార్లు ప్లేఆఫ్‌కు చేరుకుంది.

గత ఐపీఎల్‌లో సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్ జట్టుపై చాలా మంది క్రికెట్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. లీగ్ దశలో బాగానే ఆడినప్పటికీ గులాబీ దళం ఫైనల్ చేరలేదు. దీంతో రాజస్థాన్ ట్రోఫీకి దూరమైంది. 2008లో ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన రాజస్థాన్.. ఆ తర్వాత నాలుగుసార్లు ప్లేఆఫ్‌కు చేరుకుంది. 2022లో రాజస్థాన్ కూడా రన్నరప్‌గా నిలిచింది.కానీ మళ్లీ గులాబీ దళానికి గోల్డెన్ ట్రోఫీ రాలేదు. ఈసారి రాహుల్ ద్రవిడ్ రాజస్థాన్ కోచ్‌గా మారాడు. అతని కోచింగ్‌లో సంజూ జట్టు రెండో ఐపీఎల్ ట్రోఫీపై కలలు కంటోంది. జెడ్డాలో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో రాజస్థాన్ ఏ క్రికెటర్లను కొనుగోలు చేసిందో తెలుసుకోండి.
ఐపీఎల్ తొలి ఎడిషన్‌లో చాంపియన్‌గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ ఈ ఏడాది మెగా వేలానికి ముందు 6 మంది క్రికెటర్లను తన వద్ద ఉంచుకుంది. మెగా వేలంలో ఆటగాళ్లను రూ.41 కోట్లకు కొనుగోలు చేసేందుకు రాజస్థాన్ మెగా వేలానికి వెళ్లింది. ఈ టీమ్‌కి ఏ క్రికెటర్‌కు ఆర్‌టీఎంను ఉపయోగించుకునే అవకాశం లేదు. మెగా వేలానికి ముందు సంజూ జట్టులో మొత్తం 19 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. 7 మంది విదేశీ క్రికెటర్లను తీసుకునే అవకాశం ఏర్పడింది. 25వ IPL మెగా వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ ఏ క్రికెటర్లను రిటైన్ చేసిందో ఒకసారి చూడండి..
సంజు శాంసన్ – 18 కోట్లు
యశస్వి జైస్వాల్ – 18 కోట్లు
ర్యాన్ పరాగ్ – 14 కోట్లు
ధృవ్ జురెల్ – 14 కోట్లు
షిమ్రాన్ హెట్మెయర్ – 11 కోట్లు
సందీప్ శర్మ – 4 కోట్లు
RR IPL 2025 జట్టు: సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, సందీప్ శర్మ, జోఫ్రా ఆర్చర్ (రూ. 12.50 కోట్లు), మహేశ్ తీక్షణ (రూ. 4.4 కోట్లు), వనీందు హసరంగా (రూ. 5.2 కోట్లు), ఆకాష్ మధ్వల్ (రూ. 1.20 కోటి), కుమార్ కార్తికేయ (రూ. 30 లక్షలు), నితీష్ రాణా (రూ. 4.20 కోట్లు), తుషార్ దేశ్‌పాండే (రూ. 6.50 కోట్లు), శుభమ్ దూబే (రూ. 80 లక్షలు), యుధ్వీర్ సింగ్ (రూ. 35 లక్షలు), ఫజల్‌హక్ ఫరూఖీ (రూ. 2 కోట్లు), వైభవ్ సూర్యవంశీ (రూ. 1.10 కోట్లు), క్వేనా మఫాకా (రూ. 1.50 కోట్లు), కునాల్ రాథోడ్ (రూ. 30 లక్షలు), అశోక్ శర్మ (రూ. 30 లక్షలు).
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
