Mother Emotional: అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట వీడియో.

Mother Emotional: అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట వీడియో.

Anil kumar poka

|

Updated on: Nov 25, 2024 | 11:36 AM

నవ మాసాలు మోసి కని పెంచిన అమ్మను ఓ కుమార్తె భారంగా భావించింది. దయ లేకుండా మతిస్థిమితం లేని అమ్మను వృద్ధాశ్రమం వద్ద వదిలేసి వెళ్లిపోయింది. ఆశ్రమం వారు సైతం ఆమెను లోపలి రానివ్వలేదు. దీంతో ఆకలితో అలమటిస్తూ తన కూతరు కోసం ఎదురు చూస్తూ ఉండిపోయింది. ఈ హృదయవిదారకర సంఘటన విజయవాడ పాయకాపురంలో జరిగింది.

గుంటూరు జిల్లాకు చెందిన రమాదేవికి ఒక్కగానొక్క కుమార్తె అల్లారు ముద్దుగా తనను పెంచి పోషించింది. అంతే కాదు మంచి చదువును కూడా చదివించింది. అనంతరం సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగికి ఇచ్చి వివాహం కూడా జరిపించింది. అమ్మతో అవసరాలు తీరిపోయాయని అనుకుందో ఏమో కానీ తల్లి పట్ల కఠినంగా వ్యవహరించింది. కొన్ని రోజుల క్రితం విజయవాడలోని మున్సిపల్ వృద్దాశ్రమంలో చేర్పించింది. ఇటీవల బుడమేరుకు వచ్చిన వరదల సమయంలో ఆమెను కుమార్తె , అల్లుడు ఇంటికి తీసుకువెళ్లారు. వృద్ధురాలిని ఆశ్రమం వద్దకు తీసుకురావొద్దని చెప్పడంతో కుమార్తె వద్ద ఉంటుంది.

ఓ బైక్ పై తీసుకువచ్చి వృద్ధాశ్రమం వద్ద తల్లిని వదిలి వెళ్లిపోయింది. దీన్ని గమనించిన వృద్ధాశ్రమం నిర్వాహకులు ఆమెను లోపలి రావివ్వలేదు.. ఏం జరుగుతుందో తెలియని ఆ తల్లి ఆశ్రమం గేటు పట్టుకొని అక్కడే ఉండిపోయింది. వృద్ధురాలు ఆకలితో అలమటిస్తూ దీన స్థితిలో ఉన్నా ఎవ్వరూ ఆమెను పట్టించుకోలేదు. వృద్ధురాలిని నిర్బంధంగా తీసుకువచ్చి ఆశ్రమ గేటు వద్ద వదిలివెళ్ళిపోయారని అక్కడి స్థానికులు చెబుతున్నారు. వృద్ధురాలి కూతురికి ఫోన్ చేసిన స్పందన లేదని అంటున్నారు. వృద్ధురాలిని ఆశ్రమంలో చేర్చుకోవాలని అక్కడకి వచ్చిన స్థానికులు నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ ఆశ్రమ సిబ్బంది ససేమిరా అన్నారు. దీంతో విజయవాడ మున్సిపల్ శాఖ నిర్వహిస్తున్న ఆశ్రమ నిర్వాహకులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.