Brahma kamalam: ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో వావ్
ప్రకృతిలో రకరకాల పువ్వులున్నాయి. అటువంటి పువ్వుల్లో ఒకటి బ్రహ్మ కమలం. ఈ పువ్వులకు హిందూ మతంలో పువ్వులకు విశిష్ట స్థానం ఉంది. హిమాలయాల్లో కనిపించే ఈ అరుదైన మొక్కను ఇప్పుడు ఇంట్లో కూడా పెంచుకుంటున్నారు. మొగ్గ తొడిగిన తర్వాత రెండు, మూడు వారాలకు ఈ బ్రహ్మ కమలం వికశిస్తుంది. అయితే ఈ అరుదైన పుష్పం రాత్రి సమయంలో మాత్రమే వికశిస్తాయి. ఉదయం వాడిపోతాయి.
బ్రహ్మ కమలాలు వికశించినప్పుడు వచ్చే పరిమళం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మతపరమైన ప్రాముఖ్యం, పౌరాణిక నేపథ్యం ఉన్న ఈ బ్రహ్మ కమలం ఒకేసారి పదుల సంఖ్యలో వికశించి చూపరులను ఆకట్టుకున్నాయి. హైదరాబాద్ మహానగరంలోని సైదాబాద్ కాలనీకి చెందిన అలిగ విద్యానంద్-చందన దంపతుల ఇంట్లో బ్రహ్మకమలం పుష్పం వికసించింది. ఒకేసారి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 26 పుష్పాలు విరబూసాయి. గతంలో ఇదే మొక్కకు 31 పుష్పాలు వికశించాయి. అయితే రాత్రి సమయంలో పూసే ఈ పువ్వులు సూర్యోదయానికి ముందే వాడిపోతాయి. బ్రహ్మ కమలం వికసించే ప్రదేశం పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకనే చాలామంది ఇళ్లలో బ్రహ్మ కమలం మొక్కను పెంచుతారు. ఈ మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండటంతో పాటు ఆనందం, శాంతి, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు. అంతేకాదు బ్రహ్మ కమలం వికసించిన ఇంట్లో అప్పటి వరకూ ఉన్న సమస్యలు తొలగిపోతాయని విశ్వాసం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
బిచ్చగాడి ఆస్తి చూసి అంతా షాక్ !! ఇనప్పెట్టె తీస్తే నోట్ల కట్టలు
ఏ బిడ్డా.. ఇది నా అడ్డా.. కవ్వాల్ అభయారణ్యంలో అడవి దున్న
ప్రపంచ రికార్డు సృష్టించిన అత్యంత పెద్ద నత్త ను చూసారా ??
అసలు ఆమె తల్లేనా ?? తాగిన మత్తులో 12 ఏళ్ల కొడుక్కి వింత శిక్ష
నగరాభివృద్ధికి 21 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చిన దాత
గోమాత మాతృ హృదయం.. మేకపిల్ల ఆకలి తీర్చి..
మంత్రగత్తె అనుమానంతో.. మహిళకు నిప్పంటించిన మూక

