Marriage Delay: 30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..

Marriage Delay: 30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..

Anil kumar poka

|

Updated on: Nov 25, 2024 | 11:28 AM

అనేక కారణాల వల్ల వివాహం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కొందరు పెళ్లి, సంబంధం అంటే భయం, తమ స్వేచ్ఛ ఎక్కడ హరించుకుపోతుందనే ఆందోళనతో కూడా పెళ్లికి దూరంగా ఉంటున్నారు. అయితే 30 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటే కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనేది ప్రతి ఒక్కరి వ్యక్తిగత నిర్ణయం. కానీ ఓ వయసు వచ్చిన తర్వాత ఇంట్లో అందరూ, స్నేహితులు, సన్నిహితులు పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తూనే ఉంటారు. ఇది చాలా సాధారణ విషయం. కానీ, పూర్వ కాలంలో బాల్య వివాహాలు జరిగేవి. కానీ, తరువాతి కాలంలో 18 ఏళ్లకే పెళ్లి చేయాలనే మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి. 18 ఏళ్లకే అమ్మాయికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావించేవారు. కానీ ఇప్పటి తరం మారిపోయింది. ఇటీవల 30 ఏళ్లు దాటిన తర్వాత కూడా చాలా మంది పెళ్లి కాకుండానే ఉంటున్నారు. అయితే పెళ్లిని ఇలా ఆలస్యం చేయడం వల్ల తప్పేంటో తెలుసా..? ఇలా పెళ్లి ఆలస్యమవడం వల్ల వచ్చే సమస్యలు ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ముఖ్యంగా ౩౦ కి దగ్గర్లో ఉన్న వాళ్ళు కచ్చితంగా తెలుసుకోవాలి..

ప్రస్తుత తరంవారు ఎక్కువగా కెరీర్ ఓరియెంటెడ్ గా ఉన్నారు . చదువు, ఉద్యోగం అనే బిజీ లైఫ్ స్టైల్ వల్ల నేటి యువత పెళ్లిని ఆలస్యం చేస్తున్నారు. పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ, మంచి ఉద్యోగం, హోదా వచ్చే వరకు ఎదురుచూస్తుంటారు. దీంతో 35 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటున్నారు. పెళ్లయ్యాక సమస్యలు తెచ్చుకునే బదులు, పెళ్లికి ముందు కాస్త జాగ్రత్తగా ఉండి, సెటిల్ అయిన తరువాత పెళ్లి చేసుకుంటే మంచిదని చాలా మంది భావిస్తున్నారు.

పూర్వం రోజుల్లో పిల్లలు తమ తండ్రి సంపాదించిన దానితోనే జీవించేవారు. కానీ, ఇప్పుడలా కాదు.. తమ కోరికలు, విలాసవంతమైన జీవితం కోసం పరుగులు తీస్తున్నారు. ఒక్కో ఇంట్లో ఒక్కో వ్యక్తికి ఒక్కో రకమైన బాధ్యతలు ఉంటాయి. అయితే, ఈ రోజుల్లో చాలా మంది ఆ బాధ్యతలను పూర్తి చేసిన తర్వాత పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. కుటుంబం మొత్తం సెటిల్ అవ్వడం, ఆర్థికంగా ఎదగడం, ఇల్లు కట్టుకోవడం… ఇలా ఎన్నో బాధ్యతలు.

ఇకపోతే, మరికొందరు ప్రేమలో పడి కొంతకాలం కలిసి జీవించి, తరువాత ఆ బంధాన్ని దూరం చేసుకుంటున్నారు. దీంతో డిప్రెషన్ కు గురై పెళ్లికి దూరంగా ఉంటున్నారు. ఇలాంటి కారణాల వల్ల కూడా వివాహం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అంతేకాదు, కొందరు పెళ్లి, సంబంధం అంటే భయం, తమ స్వేచ్ఛ ఎక్కడ హరించుకుపోతుందనే ఆందోళనతో కూడా పెళ్లికి దూరంగా ఉంటున్నారు. అయితే 30 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటే కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.