తన పొలానికి సంబంధించి పాసుపుస్తకం ఇవ్వాలని అధికారులు చుట్టూ కళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకపోవడంతో ఆ రైతన్న ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వినూత్న రీతిలో తన నిరసన తెలిపాడు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండల పరిధిలోని కాళసముద్రం గ్రామానికి చెందిన రజకుడు గంగులప్ప కదిరి తహశీల్దార్ కార్యాలయం వద్ద చాకిరేవు నిర్వహించి తన నిరసన వ్యక్తంచేశాడు.