Casio ring watch: ఈ వాచ్‌ను చేతికి కాదు వేలికి పెట్టుకోవాలి.. క్యాసియో నుంచి నయా రింగ్ వాచ్

సాధారణంగా వాచీలను చేతి మణికట్టుపై పెట్టుకుంటాం. దాని వల్ల టైమ్ చూసుకోవడానికి అనుకూలంగా ఉండడంతో పాటు చేతికి అందం వస్తుంది. పూర్వకాలం నుంచి అందరూ ఇదే విధానం పాటిస్తున్నారు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా వాచీలు కొత్త రూపాన్ని సంతరించుకుంటున్నాయి. మరింత స్టార్ట్ గా తయారవుతున్నాయి.

Casio ring watch: ఈ వాచ్‌ను చేతికి కాదు వేలికి పెట్టుకోవాలి..  క్యాసియో నుంచి నయా రింగ్ వాచ్
Casio Ring Watch
Follow us
Srinu

|

Updated on: Nov 24, 2024 | 8:30 PM

గతంలో చేతి వాచీలకు ఎంతో డిమాండ్ ఉండేది. ఆ తర్వాత స్మార్ట్ వాచ్ లకు విపరీతమైన ఆదరణ లభించింది. వాటిలో సమయంతో పాటు వ్యాయాయం, ఆరోగ్యానికి సంబంధించిన అనేక ఫీచర్లు ఉంటున్నాయి. ఇప్పుడు వాచీలు మరింత స్టార్ట్ రూపాన్ని సంతరించుకుంటున్నాయి. కేవలం అంగుళం వెడల్పుతో ఉండే రింగ్ వాచీలు వస్తున్నాయి. వీటికి చేతి వేలికి ధరించేలా తయారు చేశారు. జపాన్ కు చెందిన ప్రముఖ వాచీల తయారీ సంస్థ క్యాసియో తన 50వ వార్షికోత్సవం సందర్భంగా రింగ్ వాచీని ఆవిష్కరించింది. వీటికి చేతి మణికట్టుపై కాకుండా చేతి వేలికి ధరించాలి. సీఆర్ డబ్ల్యూ- 001-1జేఆర్ పేరుతో ఆవిష్కరించిన రింగ్ వాచీ ఎంతో ఆకట్టుకుంటుంది. చేతి వేలికి ఉంగరం మాదిరిగా కొత్త లుక్ ను అందిస్తోంది. దీని బరువు కేవలం 16 గ్రాములే. దీని ద్వారా రెండు జోన్లలో టైమ్ తెలుసుకోవచ్చు. అలాగే వివిధ తేదీలను ట్రాక్ చేసుకోవచ్చు. అలారంతో పాటు స్టాప్ వాచ్ ఫీచర్ కలిగింది. నాణ్యమైన స్లెయిన్ లెస్ స్టీల్ తో దీన్ని తయారు చేశారు .

క్యాసియో కంపెనీ తన 50 ఏళ్ల అనుభవాన్ని ఉపయోగించి కొత్త రింగ్ వాచీని తయారు చేసింది. డిజిటల్ వాచీల తయారీలో పేరు గాంచిన ఈ కంపెనీ మరో వినూత్న ఆవిష్కరణ చేసింది. ఉంగరానికి స్మార్ట్ వాచీని కలిపి కొత్త ప్రయోగం చేసింది. డిజైన్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. అతి తక్కువ బరువుతో మన్నికైన వాచీని తయారు చేసి కొత్త ఫ్యాషన్ కు తెరతీసింది. స్టెయిన్ లెస్ స్టీల్ బాడీ, 15 గ్రాముల బరువు, వాటర్ ప్రూఫ్, రెట్రో ఎల్ఈడీ డిస్ ప్లే తదితర ఫీచర్లు ఉన్నాయి. రింగ్ వాచీలో మూడు ఫిజికల్ బటన్లు ఉంటాయి. వీటి ద్వారా టైమ్ ను సెట్ చేసుకోవచ్చు. చీకటిలో కూడా టైమ్ చూసుకునేందుకు వీలుగా లైట్ ఏర్పాటు చేశారు. అయితే దీనిలో అలారం మోగినప్పుడు సౌండ్ రాదు. కేవలం లైట్ మాత్రమే ప్లాష్ అవుతుంది. అలాగే స్లీప్ ట్రాకింగ్, హార్ట్ బీట్, బ్లడ్ ఆక్సిజన్ లెవల్ మానిటరింగ్, ఫిట్ నెస్ ట్రాకింగ్ తదితర ఫీచర్లు లేవు.

క్యాసియో 50వ వార్షికోత్సవం సందర్బంగా రూపొందించిన ఈ వాచీ డిసెంబర్ నుంచి మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది. జపాన్ లో దీని ధర 19,800 యొన్ గా నిర్ణయించారు. మన కరెన్సీలో దాదాపు రూ.10,810 వరకూ ఉంటుంది. వాచీలోని బ్యాటరీని రే ప్లేస్ బుల్ చేసుకోవచ్చు. దాదాపు రెండేళ్ల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి