IPL 2025 Auction: గాయాలతో ఆగమాగం.. కట్‌చేస్తే.. రూ. 12.50 కోట్లు కురిపించిన రాజస్థాన్.. ఎవరంటే?
Jofra Archer: గాయపడినప్పటికీ, ఆర్చర్ 2022 వేలంలో ముంబై ఇండియన్స్ టీంలో ఎంపికయ్యాడు. 2023 IPLలో జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అయినప్పటికీ అతను నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అంతకు ముందు, ఆర్చర్ రాజస్థాన్ రాయల్స్‌తో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
Jofra Archer: ఆదివారం సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన IPL 2025 వేలంలో జోఫ్రా ఆర్చర్‌ను రూ. 12.50 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. ఆర్చర్ మొదట్లో వేలం లాంగ్‌లిస్ట్‌లో భాగమయ్యాడు. అయితే, ECB అతనికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) నిరాకరించిన కారణంగా, తుది షార్ట్‌లిస్ట్ నుంచి మినహాయించారు. వచ్చే ఏడాది జరిగే యాషెస్ సిరీస్‌కు ముందు అతని గాయం కోలుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలని బోర్డు కోరింది.
అయితే, అతను వేలంలో 38వ ఇంగ్లీష్ ఆటగాడిగా చివరి జాబితాలోకి ప్రవేశించాడు. అంతకుముందు వైట్-బాల్ కెప్టెన్ జోస్ బట్లర్, 42 ఏళ్ల జేమ్స్ ఆండర్సన్‌లను చేరిన సంగతి తెలిసిందే.
ఇంగ్లండ్‌లో ఆల్ టైమ్ లీడింగ్ వికెట్ టేకర్ అయిన అండర్సన్ విదేశీ ఫ్రాంచైజీ లీగ్‌లో ఎప్పుడూ ఆడలేదు.
టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్, ఆర్చర్ సహచర ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్, బ్యాటర్ జో రూట్ వేలానికి గైర్హాజరయ్యారు. గత కొన్నేళ్లుగా వరుస గాయాలతో ఆర్చర్ కెరీర్ దెబ్బతింటోంది. దీంతో అతను క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అతను 2021 ప్రారంభం నుంచి టెస్ట్ క్రికెట్ ఆడలేదు.
గాయపడినప్పటికీ, ఆర్చర్ 2022 వేలంలో ముంబై ఇండియన్స్ టీంలో ఎంపికయ్యాడు. 2023 IPLలో జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అయినప్పటికీ అతను నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అంతకు ముందు, ఆర్చర్ రాజస్థాన్ రాయల్స్‌తో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.