స్లిప్‌లో చెత్త ఫీల్డర్‌గా విరాట్ కోహ్లీ.. ఎన్ని క్యాచ్‌లు జార విడిచాడో తెలుసా?

TV9 Telugu

23 November 2024

విరాట్ కోహ్లి బ్యాట్‌తో బ్యాడ్ ఫామ్‌లో ఉండటమే కాకుండా అతని ఫీల్డింగ్ ప్రమాణాలు కూడా మరింత దిగజారాయి.

విరాట్ పేలవ ప్రదర్శన

గత రెండేళ్లలో విరాట్ స్లిప్ ఏరియాలో అత్యధిక క్యాచ్‌లు జారవిడిచిన లిస్ట్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే.

క్యాచ్‌లను మిస్ చేసిన కోహ్లీ

గత రెండేళ్లలో విరాట్‌కు స్లిప్‌లో 26 అవకాశాలు వచ్చాయి. అతను 34.61 శాతం క్యాచ్‌లను వదులుకున్నాడు.

స్లిప్స్‌లో పేలవ ప్రదర్శన

బుమ్రా వేసిన బంతికి విరాట్‌ క్యాచ్‌ను జారవిడిచాడు. విరాట్ క్యాచ్ పట్టి ఉంటే, బుమ్రా 5 వికెట్లు మొదటి రోజునే పూర్తయ్యేవి.

బుమ్రాకు ఎఫెక్ట్

పెర్త్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి కూడా బ్యాట్‌తో విఫలమయ్యాడు. ఈ ఆటగాడు కేవలం 5 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

బ్యాట్‌తోనూ ఫ్లాప్

టీం ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌట్ అయింది. నితీష్ రెడ్డి 41, పంత్ 37 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు.

150కే భారత్ ఆలౌట్

అనంతరం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగులకే కుప్పకూలింది. ఇందులో బుమ్రా 5 వికెట్లు పడగొట్టి, కంగారులను దెబ్బ తీశాడు.

104 పరుగులకే ఆసీస్ ఆలౌట్

దీంతో తొలి ఇన్నింగ్స్ ముగిసే సరికి భారత జట్ట 46 పరుగుల ఆధిక్యంతో నిలిచింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన భారత్ వికెట్ నష్టపోకుండా 96 పరుగులు చేసింది. దీంతో లీడ్ 142కి పెరిగింది.

ఆధిక్యంలో భారత్