AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India GDP: భారత జీడీపీ ఆశ్చర్యకర వృద్ధి.. భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశం

India Growth Story: ఓ దేశం వృద్ధి అంచనా అనేది ఆ దేశ జీడీపీపై ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో అన్ని దేశాలు జీడీపీ వృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఉంటాయి. ఇటీవల భారతదేశంలో కూడా జీడీపీ వృద్ధి కోసం చేసిన ప్రయత్నాలు సఫలం అవుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ఓ నివేదికలో ఈ విషయం స్పష్టం అయ్యింది. ఈ నేపథ్యంలో భారతదేశంలో జీడీపీ వృద్ధి గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

India GDP: భారత జీడీపీ ఆశ్చర్యకర వృద్ధి.. భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశం
Gdp Growth
Nikhil
| Edited By: Janardhan Veluru|

Updated on: Nov 25, 2024 | 6:19 PM

Share

ఐసీఆర్ఏ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (అక్టోబర్-డిసెంబర్ 2024) మొదటి సగం (ఏప్రిల్-సెప్టెంబర్ 2024)తో పోలిస్తే భారతదేశ ఆర్థిక వ్యవస్థ మూడవ త్రైమాసికంలో వేగంగా వృద్ధి చెందుతుందని అంచనా వేసింది.  అయితే ఈ వృద్ధి అనేది ఆర్థిక సూచికలను మెరుగుపరచడంతో పాటు వివిధ రంగాల్లో బలమైన కార్యాచరణ స్థాయిలపై ఆధారపడి ఉందని నివేదిక పేర్కొంది. నవంబర్ 2024కి సంబంధించిన ప్రాథమిక డేటా సానుకూల ధోరణిని సూచిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అనుకూలమైన బేస్ ఎఫెక్ట్ కారణంగా విద్యుత్ డిమాండ్ వృద్ధి పెరిగింది. అయితే పండుగ సీజన్ డిమాండ్ వాహనాల రిజిస్ట్రేషన్లలో పెరుగుదలను కొనసాగిస్తోంది.

ఐసీఆర్ఏ నివేదిక ప్రకారం రవాణాకు సంబంధించిన అనేక సూచికలు గణనీయమైన అభివృద్ధిని నమోదు చేశాయి. ముఖ్యంగా వాహనాల రిజిస్ట్రేషన్‌లు అక్టోబర్ 2024లో ఏడాది ప్రాతిపదికన 32.4 శాతానికి పెరిగాయి. ఈ స్థాయి వృద్ధిని మనం అంచనా వేస్తే సెప్టెంబర్ 2024లో 8.7 శాతం సంకోచం నుంచి వేగంగా కోలుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ద్విచక్ర వాహనాలతో పాటు ప్రయాణీకుల వాహనాలకు బలమైన డిమాండ్‌తో ఈ పెరుగుదలకు కారణమైందని చెబుతున్నారు. సెప్టెంబర్‌లో పెట్రోలు వినియోగం 3.0 శాతం నుంచి 8.7 శాతానికి పెరిగింది. అలాగే దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ 6.4 శాతం నుంచి 9.6 శాతానికి పెరిగింది.

ముఖ్యంగా ద్విచక్ర వాహనాల ఉత్పత్తి 13.4 శాతం పెరిగింది. రైలు ద్వారా సరుకు రవాణా 0.7 శాతం క్షీణత నుంచి 1.5 శాతానికి మెరుగుపడింది. డీజిల్ వినియోగం సెప్టెంబరులో 1.9 శాతం తగ్గిన తర్వాత 0.1 శాతం స్వల్ప వృద్ధిని నమోదు చేసింది. ముఖ్యంగా భారతదేశంలో చమురుయేతర ఎగుమతులు కూడా బలమైన పనితీరును నమోదు చేశాయని సెప్టెంబర్‌లో 6.8 శాతంతో పోలిస్తే 2024 అక్టోబర్‌లో 25.6 శాతం వృద్ధి చెందిందని ఐసీఆర్ఏ నివేదికలో స్పష్టం చేశారు. ఈ వృద్ధికి ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇంజినీరింగ్ వస్తువులు, రసాయనాలు, రెడీమేడ్ వస్త్రాలు కీలకంగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..