Retirement Planning: 35 ఏళ్లకే రిటైర్ కావాలనుకొంటున్నారా? రూ. కోట్లలో ఆదాయాన్ని సమకూర్చుకొనే ఫార్ములా ఇది..
చాలా మంది రిటైర్ మెంట్ ప్లానింగ్ అంటే అరవై ఏళ్లకు కదా అని లైట్ తీసుకుంటారు. కానీ ఇటీవల కాలంలో ఎక్కువ మంది త్వరగా సెటిల్ అవ్వడానికి మొగ్గుచూపుతున్నారు. తక్కువ వయసులోనే ఆర్థిక లక్ష్యాలను వీలైనంత త్వరగా చేరుకోవాలనే లక్ష్యంతో ముందుకుసాగుతున్నారు. మంచి సంపాదన, పొదుపు ప్లానింగ్, మంచి పెట్టుబడి పథకాలలో నగదు పెట్టుబడి పెట్టడం ద్వారా దీనిని సాధిస్తున్నారు.
చాలా మంది రిటైర్ మెంట్ ప్లానింగ్ అంటే అరవై ఏళ్లకు కదా అని లైట్ తీసుకుంటారు. కానీ ఇటీవల కాలంలో ఎక్కువ మంది త్వరగా సెటిల్ అవ్వడానికి మొగ్గుచూపుతున్నారు. తక్కువ వయసులోనే ఆర్థిక లక్ష్యాలను వీలైనంత త్వరగా చేరుకోవాలనే లక్ష్యంతో ముందుకుసాగుతున్నారు. మంచి సంపాదన, పొదుపు ప్లానింగ్, మంచి పెట్టుబడి పథకాలలో నగదు పెట్టుబడి పెట్టడం ద్వారా దీనిని సాధిస్తున్నారు. కేవలం 12 నుంచి 13 ఏళ్లు బాగా కష్టపడి 35 ఏళ్లు వచ్చే నాటికి లైఫ్ సెటిల్ చేసుకుంటున్నారు. కొన్ని నివేదికల ప్రకారం, దాదాపు 38 శాతం మంది భారతీయులు పదవీ విరమణ ప్రణాళికకు సరైన వయస్సు 35 ఏళ్లలోపు ఉండాలని అభిప్రాయపడుతున్నారు. మరో 49 శాతం మంది మీరు పని ప్రారంభించినప్పుడు, పదవీ విరమణను ముందుగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. అయితే ఇది అందరికీ సాధ్యమా? అంటే.. సాధ్యమే అంటున్నారు నిపుణులు. కానీ అందుకు కచ్చితమైన ప్లానింగ్, సరైన పథకాలలో పెట్టుబడి పెట్టడం అవసరమని చెబుతున్నారు. 12-13 సంవత్సరాలు మాత్రమే పనిచేసిన తర్వాత పదవీ విరమణ చేయడం కలలా కనిపిస్తున్నప్పటికీ, అది సాధించేందుకు కొన్ని మార్గాలను నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం..
ఆర్థిక స్వేచ్ఛ.. మొదట మీ ఆర్థిక లక్ష్యాన్ని సాధించడం మీ తొలి ప్రాధాన్యతగా ఉండాలి. ఆర్థిక అలవాట్లలో మార్పులు చేయాలి; మీరు సంపాదిస్తున్న డబ్బులో ఎక్కువ పెట్టుబడి పెట్టడం మొదటి అడుగు. మీరు మీ ఆదాయంలో 70% ఆదా చేయడం కూడా ప్రారంభించాలి. ఇది మొదట కష్టంగా ఉండవచ్చు, కానీ కాలక్రమేణా సులభం అవుతుంది. మీ ఖర్చులు తగ్గించుకోవాలి. మీరు చేస్తున్న త్యాగాలు మీ లక్ష్యానికి మద్దతుగా ఉంటాయని తెలుసుకోండి.
అదనపు ఆదాయం.. మీకు స్థిరమైన ఉద్యోగం ఉన్నప్పటికీ, మీ ఆదాయాన్నిపెంచుకోవడానికి మీ నైపుణ్యాలను ఉపయోగించండి. అందుకోసం మీరు ఒక సైట్‌ను ప్రారంభించవచ్చు లేదా మీ సొంత యూ ట్యూబ్ చానల్ ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా ఫ్రీలాన్స్ రైటింగ్‌కు కూడా చేయవచ్చు. మీ కార్యాలయంలో కూడా కష్టపడి పని చేయండి. తద్వారా మీరు పదోన్నతుల కోసం డిమాండ్ చేయొచ్చు. ఎక్కువ ఆదాయం, ఎక్కువ పొదుపులు, మంచి పథకాలలో పెట్టుబడులు. ఇది సులభమైన పదవీ విరమణ మంచి ప్రణాళిక.
మీ ఖర్చును నెలవారీ సమీక్షించండి.. మీ డబ్బు ఎక్కడికి వెళుతుందో మీరు తెలుసుకోవాలి. చాలా మందికి నెలకు ఒకసారి వారి ఖర్చులను సమీక్షించే క్రమశిక్షణ లేకపోవడంతో ఇబ్బందులు పడతారు. అయితే కొంచెం అవగాహన చాలా పెద్ద మార్పును కలిగిస్తుంది. మీ సరదా ఖర్చులు, నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌లు, బయట తినడం వంటి చిన్న ఖర్చులపై చెక్ చేసుకోండి. మీ బిల్లులోని ప్రతి కాలమ్ ను అర్థం చేసుకోండి.
నిధుల అంచనా.. మీరు భారతదేశంలో పదవీ విరమణ చేయవలసిన నిధులు మీ జీవనశైలి లక్ష్యాలు, పదవీ విరమణ ఆదాయం అంచనా మూలాలు, ద్రవ్యోల్బణంపై ఆధారపడి ఉంటాయి. నిపుణులు చెబతున్న దాని ప్రకారం.. పదవీ విరమణ తర్వాత మీ వార్షిక వ్యయం రూ. 10,00,000 అయితే, మీరు 20 సంవత్సరాలు పనిచేసి పదవీ విరమణ చేయాలనుకుంటున్నట్లయితే, 6% ద్రవ్యోల్బణం రేటు అనుకుంటే మీకు అవసరమైన పదవీ విరమణ కార్పస్ రూ. 2.5 కోట్లు అవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..