LIC Plans: మహిళల కోసంఎల్ఐసీ నుంచి అదిరిపోయే పాలసీ.. నెలకు 900 పొదుపు చేస్తే రూ. 4 లక్షలు పొందవచ్చు..!
LIC Insurance Plan: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ ప్రజల కోసం ఎన్నో బీమా పథకాలను తీసుకువచ్చింది. వీటి ద్వారా ప్రజలు ఎంతగానో..
LIC Insurance Plan: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ ప్రజల కోసం ఎన్నో బీమా పథకాలను తీసుకువచ్చింది. వీటి ద్వారా ప్రజలు ఎంతగానో లబ్ధి పొందుతున్నాయి. ఈ పాలసీల్లో కొన్ని ప్రత్యేకమైనవి కూడా ఉన్నాయి. పిల్లల కోసం, మహిళల కోసం, వృద్ధుల కోసం ఇలా రకరకాల ప్లాన్స్‌ను ఎల్ఐసీ అందిస్తోంది. అందులో భాగంగానే మహిళల కోసం ఎల్ఐసీ ఆధార్ శిలా స్కీమ్ తీసుకువచ్చింది. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మహిళలు అధిక మొత్తాన్ని పొందే అవకాశం ఉంది.
పథకం వివరాలు ఇవి.. ఆధార్ కార్డు కలిగిన మహిళలు ఎవరైనా ఈ పాలసీని తీసుకోవచ్చు. రోజుకు 29 రూపాయలు పొదుపు చేస్తే.. మెచ్యూరిటీ సమయంలో రూ. 4 లక్షలు లభిస్తాయి. అంతేకాదు.. ఈ కాలంలో లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. 8 నుంచి 55 ఏళ్ల వయస్సు ఉన్న మహిళలు ఎవరైనా ఈ పాలసీని తీసుకోవచ్చు. ఈ పాలసీ 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు కాలపరిమితి కలిగి ఉంది. కనిష్టంగా రూ.75 వేలు, గరిష్టంగా 3 లక్షల వరకు బీమా పాలసీ తీసుకోవచ్చు. దీని ప్రీమియం ను నెల, మూడు నెలలు(త్రైమాసికం), ఆరు నెలలు(అర్ధవార్షికం), ఏడాది లెక్కన చెల్లించవచ్చు.
ఉదాహరణకు 20 ఏళ్ల వయసు వారు 20 ఏళ్ల కాల పరిమితితో రూ. 3 లక్షల బీమా పాలసీ తీసుకున్నట్లయితే.. వార్షిక ప్రీమియం రూ.10,800 ఉంటుంది. అంటే రోజుకు రూ. 29 చెల్లించాలన్నమాట. మెచ్యూరిటీ సమయంలో మొత్తం రూ. 4 లక్షలు వస్తాయి. ఇక ప్రీమియం డబ్బులు, డెత్ క్లెయిమ్స్‌పై ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
Also read:
Puzzle Challenge: ఇది కదా అసలైన ఛాలెంజ్.. ఈ ఫజిల్‌ను చేజ్ చేస్తే మీకన్నా జీనియస్ లేనట్లే!