ప్రపంచంలో టాప్ 50 రెస్టారెంట్లలో మూడు మన దేశానివే.. అక్కడ తినాలంటే ఆస్తులు అమ్మాల్సిందే..!
Asia Best Top 50 Restaurants: భారతదేశంలోని 3 రెస్టారెంట్లు ఆసియాలోని టాప్-50 రెస్టారెంట్ల జాబితాలో చేరాయి. వాటిలో ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ కూడా ఉంది. ఇక్కడ రేట్లు చూస్తే మాత్రం కళ్లు బైర్లు కమ్మాల్సిందే.
ఢిల్లీలోని ఒక రెస్టారెంట్ ఆసియాలోని ఉత్తమ-50 రెస్టారెంట్‌ల(Asia Best Top 50 Restaurants)లో చేరింది. దీంతోపాటు దేశంలోని మరో రెండు రెస్టారెంట్లు కూడా ఈ జాబితాలో భాగమయ్యాయి. ఈ జాబితాను విలియం రీడ్ బిజినెస్ మీడియా లిమిటెడ్ తయారు చేసింది. ఈ లిస్టులో టోక్యో(జపాన్)లోని ఓ రెస్టారెంట్ కూడా ఉంది. ఈ జాబితాలో భారతదేశం(India) నుంచి మొదటి ఎంట్రీలో ముంబై(Mumbai)లోని మాస్క్ రెస్టారెంట్ 21వ స్థానంలో ఉంది. ఈ రెస్టారెంట్ మెనూ లిస్ట్ చూస్తే మాత్రం కచ్చితంగా మధ్యతరగతి కస్టమర్లకు షాక్ అవ్వడం ఖాయం. ఇక్కడ సమోసా చాట్ రూ.450, లాంబ్ దమ్ బిర్యానీ రూ.1250గా ఉంది. ముంబయిలోని మహాలక్ష్మి ప్రాంతంలో ఈ రెస్టారెంట్ ఉంది.
దేశ రాజధానిలో రేట్లు చేస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..
ఈ జాబితాలో 22వ స్థానంలో ఉన్న భారత్ నుంచి రెండవ ఎంట్రీ న్యూ ఢిల్లీలోని ఇండియన్ యాక్సెంట్ రెస్టారెంట్‌దే. దీనిని చెఫ్ మనీష్ మెహ్రోత్రా ప్రారంభించారు. ఢిల్లీలోని లోధి గార్డెన్ ప్రాంతంలో ఈ రెస్టారెంట్ ఉంది. దీని లుక్ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ రెస్టారెంట్‌లోని మెనూ కార్డ్‌ని చూస్తే మాత్రం కచ్చితంగా కళ్లు బైర్లు కమ్ముతాయి. బటర్ చికెన్ కుల్చా (తందూరి రోటీకి మరో వేరియంట్) నుంచి ఆనియన్ హెర్బ్ మిల్లెట్ రోటీ, యాపిల్‌వుడ్ స్మోక్డ్ బేకన్ కుల్చా వరకు రూ. 450లుగా ఉన్నాయి. అదే సమయంలో ఇక్కడ దాల్ మొరదబడి ధర రూ.1,050, స్మోక్‌డ్ బెండకాయ రైతా ధర రూ.525గా ఉంది. ఈ రెస్టారెంట్లలో అడుగుపెట్టాలంటే బిల్లు తడిసి మోపెడు అవుతుంది.
ఈ జాబితాలో ఢిల్లీలోని మరో రెస్టారెంట్ మేగూ 49వ స్థానంలో నిలిచింది. ఈ రెస్టారెంట్ మిసో గ్రిల్డ్ బేబీ చికెన్‌కి చాలా ప్రసిద్ధి చెందింది. దీని ధర రూ.1,800గా ఉంది. అలాగే బీబీక్యూ న్యూజిలాండ్ లాంబ్ చాప్స్ ధర రూ. 2,800 వరకు ఉంది. ఈ జాబితాలో డెన్ ఆఫ్ టోక్యో, జపాన్, సోర్న్ ఆఫ్ బ్యాంకాక్ రెండవ స్థానంలో ఉన్నాయి. టోక్యో ఫ్లోరిలేజ్ రెస్టారెంట్ మూడో స్థానంలో ఉన్నాయి.
Also Read: LIC Plans: ఎల్ఐసీ నుంచి అదిరిపోయే పాలసీ.. రోజూ రూ.29 సేవ్ చేస్తే రూ. 4 లక్షలు పొందవచ్చు..!