LIC IPO: నేడు ఎల్‌ఐసీ క్యూ4, వార్షిక ఫలితాల విడుదల.. డివిడెండ్‌ ప్రకటిస్తారా.. లేదా..?

మీరు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ IPOలో పెట్టుబడి పెట్టి మీరు లిస్టింగ్ లాభం పొంది ఉండకపోవచ్చు కానీ.. కంపెనీ ఇప్పుడు డివిడెండ్ చెల్లించాలని ఆలోచిస్తోంది. మార్చి త్రైమాసిక ఫలితాలను కంపెనీ ఈరోజు ప్రకటించనుంది...

LIC IPO: నేడు ఎల్‌ఐసీ క్యూ4, వార్షిక ఫలితాల విడుదల.. డివిడెండ్‌ ప్రకటిస్తారా.. లేదా..?
Lic
Follow us
Srinivas Chekkilla

|

Updated on: May 30, 2022 | 9:54 AM

మీరు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ IPOలో పెట్టుబడి పెట్టి మీరు లిస్టింగ్ లాభం పొంది ఉండకపోవచ్చు కానీ.. కంపెనీ ఇప్పుడు డివిడెండ్ చెల్లించాలని ఆలోచిస్తోంది. మార్చి త్రైమాసిక ఫలితాలను కంపెనీ ఈరోజు ప్రకటించనుంది. ఎల్‌ఐసి (LIC) తరపున రిజల్ట్ ప్రకటించడమే కాకుండా డివిడెండ్ చెల్లించే నిర్ణయాన్ని బోర్డు తీసుకోవచ్చు. స్టాక్ మార్కెట్‌(Stock Market)కు ఇచ్చిన సమాచారంలో జీవిత బీమా సంస్థ మొత్తం ఆర్థిక సంవత్సరంలో ఆడిట్ చేసిన ఫలితాలు, త్రైమాసిక ఫలితాలు, కంపెనీ పనితీరుకు సంబంధించిన ఫలితాలను సోమవారం ప్రకటిస్తుంది. కంపెనీ డైరెక్టర్ల బోర్డు డివిడెండ్(Dividend) చెల్లించాలని నిర్ణయించుకుంటే, ఈరోజునే ప్రకటించవచ్చు. ఎల్‌ఐసీ షేర్లు లిస్టింగ్ ధర కంటే 13 శాతం తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం దీని మార్కెట్ క్యాప్ 5.25 లక్షల కోట్లకు చేరువలో ఉంది. ఎల్‌ఐసీ 21 వేల కోట్ల ఐపీఓ చాలా బలహీనంగా ఉంది. ఇది 9 శాతం తగ్గింపుతో మే 17న స్టాక్‌ మార్కెట్‌లో లిస్టయింది. దీని ఇష్యూ ధర రూ.949. నుంచి రూ.818 స్థాయికి దిగజారింది.

LIC లిస్టింగ్ తర్వాత, DIPAM కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే మాట్లాడుతూ ఊహించని మార్కెట్ పరిస్థితుల కారణంగా దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీ LIC బలహీనంగా ప్రారంభమైందని చెప్పారు. దీర్ఘకాలంలో లాభాలు పొందేందుకు ఎల్‌ఐసీ షేర్లను ఉంచుకోవాలని ఆయన ఇన్వెస్టర్లకు సూచించారు. స్టాక్ మార్కెట్‌ను ఎవరూ ఊహించలేరని పాండే అన్నారు. సెకండరీ మార్కెట్‌లో షేర్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని, దాని కారణంగా ధర పెరుగుతుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం మార్కెట్‌లో భయాందోళనలు నెలకొని ఉన్నాయని, దీని వల్ల భారీ జంప్‌ను ఊహించలేదన్నారు. మనం ముందుకు వెళ్లే కొద్దీ స్టాక్ పెరుగుతుందని ఎల్‌ఐసీ ఛైర్మన్ ఎంఆర్ కుమార్ చెప్పారు. అలాట్‌మెంట్ పొందలేని పాలసీదారులు సెకండరీ మార్కెట్‌లో కొనుగోలు చేస్తారని అన్నారు. DIPAM సెక్రటరీ ఈ అభిప్రాయం కూడా చాలా మంది మార్కెట్ నిపుణుల అభిప్రాయానికి అనుగుణంగా ఉంది. చాలా మంది మార్కెట్ నిపుణులు స్టాక్ హోల్డర్‌లకు పెట్టుబడిని కొనసాగించాలని సలహా ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?