LIC: రోజుకు 200 రూపాయలతో లక్షలు సంపాదించే అవకాశం.. ఎల్ఐసీ అందిస్తున్న అదిరిపోయే ప్లాన్.. ఎలానో తెలుసుకోండి!

మనదేశంలో ప్రభుత్వ సెక్టార్ లో పనిచేస్తున్న సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ). జీవిత బీమా పథకాలతో పాటు.. ఇన్వెస్ట్ మెంట్ పథకాలను కూడా కలిపి అందిస్తుంది ఎల్ఐసీ.

LIC: రోజుకు 200 రూపాయలతో లక్షలు సంపాదించే అవకాశం.. ఎల్ఐసీ అందిస్తున్న అదిరిపోయే ప్లాన్.. ఎలానో తెలుసుకోండి!
Lic Plan
Follow us
KVD Varma

|

Updated on: Aug 22, 2021 | 12:47 PM

LIC: మనదేశంలో ప్రభుత్వ సెక్టార్ లో పనిచేస్తున్న సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ). జీవిత బీమా పథకాలతో పాటు.. ఇన్వెస్ట్ మెంట్ పథకాలను కూడా కలిపి అందిస్తుంది ఎల్ఐసీ. వేరే పథకాల్లో పెట్టుబడి పెట్టడం కన్నా ఎల్ఐసీలో పెట్టుబడి పెట్టడం సురక్షితమైన మార్గం. ఎందుకంటే ఇది ప్రబుత్వరంగ సంస్థ కావడం అదేవిధంగా ఎన్నో దశాబ్దాలుగా ఇన్సూరెన్స్ రంగంలో సేవలు అందిస్తూ వస్తోంది ఎల్ఐసీ.

మీరు మీ డబ్బుల్ని ఎక్కడైనా ఇన్వెస్ట్ చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసం ఒక అదిరే పాలసీని అందిస్తోంది ఎల్ఐసీ. ఈ పాలసీ మంచి రాబడిని అందిస్తుంది. దీనిద్వారా మీ సొమ్ము పదిలంగా ఉండటమే కాకుండా.. చక్కని రిటర్న్స్ కూడా అందిస్తుంది.  ఈ పాలసీ గురించిచెప్పుకోవాల్సి వస్తే.. ఈ పథకం పేరు ని అందిస్తోంది ఎల్ఐసీ జీవన్  ప్రగతి యోజన (LIC Jeevan Pragati Yojana). దీనిలో డబ్బులు పెడితే చక్కటి ప్రయోజనాలని పొందొచ్చు. ఈ పాలసీ లో మీరు రోజూ రూ.200 ఆదా చెయ్యాల్సి ఉంటుంది. ఇలా 20 ఏళ్లు చేస్తే… మొత్తం పెట్టిన పెట్టుబడి సుమారు రూ.15 లక్షల దాకా అవుతుంది.

ఈ ఎపట్టుబడిపై మీకు ఒకేసారి రూ.28 లక్షలు రిటర్న్ ఇస్తారు. ఇది ఇలా ఉంటే ఈ పాలసీ లో మరొక ప్రత్యేకత వుంది.  అది ఏమిటంటే.. ఈ పాలసీ తీసుకుంటే అదనంగా రూ.15,000 పెన్షన్ కూడా ఇస్తారు. ప్రతి ఐదేళ్లకి ఒకసారి దీని రిస్క్ కవర్ కూడా పెరుగుతుంది. 6 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు ఇన్సూరెన్స్ రిస్క్ కవర్ 25 శాతం నుంచి 125 శాతానికి పెరుగుతుంది.

11 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వరకు రిస్క్ కవర్ 150 శాతానికి పెరుగుతుంది. అదే ఒకవేళ మీరు 20 ఏళ్ల వరకూ చెల్లిస్తూ డబ్బులు కనుక తీసుకోకపోతే మీకు రిస్క్ కవర్ 200 శాతానికి పెరుగుతుంది. ఇలా ఈ పాలసీతో లాభాలు పొందొచ్చు. ఉదాహరణకి ఎవరైనా రూ.2 లక్షలకు పాలసీ తీసుకుంటే… మొదటి ఐదేళ్ల వరకూ బీమా కవరేజీ అంతే ఉంటుంది. ఆ తర్వాత 6-10 మధ్య అది రూ.2.5 లక్షలు ఉంటుంది. అలాగే 11-15 ఏళ్ల మధ్య అది రూ.3లక్షలు ఉంటుంది. 16-20 ఏళ్ల మధ్య బీమా కవరేజీ రూ.4 లక్షలు ఉంటుంది. 12 నుంచి 45 ఏళ్ల మధ్య వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. పాలసీ కనీస గడువు 12 ఏళ్లు, గరిష్ట గడువు 20 ఏళ్లు.

తక్కువ పెట్టుబడితో ఎక్కువ ప్రయోజనం పొందడమే కాకుండా.. బీమా కవరేజ్ కూడా చాలా చక్కగా ఉన్న పెట్టుబడి పథకం ఇది.

Also Read: MI TV – Mobile: సరికొత్త మోడల్ టీవీ, మొబైల్‌ను విడుదల చేసిన షియోమి.. ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే..

Fuel Rates: గుడ్‌ న్యూస్‌.. 35 రోజుల తర్వాత తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు. ఎంత తగ్గాయో తెలుసా.?