LIC Policy: ఈ ఎల్ఐసీ పాలసీతో పదింతల అధిక ప్రయోజనాలు.. అతి తక్కువ కాలంలోనే రూ. 50లక్షలు సంపాదించొచ్చు..
అలాంటి అధిక రాబడినిచ్చే పథకాలలో ఎల్ఐసీ బీమా రత్న పాలసీ ఒకటి. ఈ పాలసీలో మెచ్యూరిటీ నాటికి రూ.50 లక్షల రిటర్న్స్ పొందొచ్చు. ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, వ్యక్తిగత, సేవింగ్స్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్.

లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సంస్థ. అలాగే దేశంలో అతి పెద్ద ఇన్సురెన్స్ కంపెనీ ఇదే. వందల సంఖ్యలో స్కీమ్స్, లక్షల్లో వినియోగదారులు ఉంటారు. పాలసీదారులకు ఆయా స్కీమ్ లలో వచ్చే ప్రయోజనాలు అధికంగా ఉండటంతో అందరూ దీనిలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు. అలాంటి అధిక రాబడినిచ్చే పథకాలలో ఎల్ఐసీ బీమా రత్న పాలసీ ఒకటి. ఈ పాలసీలో మెచ్యూరిటీ నాటికి రూ.50 లక్షల రిటర్న్స్ పొందొచ్చు. ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, వ్యక్తిగత, సేవింగ్స్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్. ఎల్ఐసీ బీమారత్న ప్లాన్ తీసుకున్నవారికి సేవింగ్స్‌పై మంచి రిటర్న్స్ రావడంతో పాటు బీమా రక్షణ ఉంటుంది. పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రీమియం చెల్లిస్తున్న కాలంలో మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తుంది ఈ పాలసీ. ఈ బీమా రత్న పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
అర్హతలు ఇవి..
ఎల్ఐసీ బీమా రత్న పాలసీని కనీసం 90 రోజుల వయస్సు ఉన్నవారు కూడా తీసుకోవచ్చు. వారికి 20 ఏళ్లు లేదా 20 ఏళ్ల టర్మ్ వర్తిస్తుంది. 15 ఏళ్ల టర్మ్‌తో పాలసీ తీసుకోవాలనుకుంటే కనీస వయస్సు 5 ఏళ్లు ఉండాలి. కనీస మెచ్యూరిటీ వయస్సు 20 ఏళ్లు. కనీసం రూ.5,00,000 సమ్ అష్యూర్డ్‌తో ఈ పాలసీ తీసుకోవచ్చు. గరిష్ట పరిమితి లేదు. పాలసీ టర్మ్ 15 ఏళ్లు, 20 ఏళ్లు, 25 ఏళ్లుగా ఉంటుంది. 25 ఏళ్ల ప్లాన్ ఎంచుకుంటే 21 ఏళ్లు ప్రీమియం చెల్లించాలి. అలాగే 20 ఏళ్ల ప్లాన్ ఎంచుకుంటే 16 ఏళ్లు ప్రీమియం చెల్లించాలి. ఇక 15 ఏళ్ల టర్మ్ ఎంచుకుంటే 11 ఏళ్లు మాత్రమే ప్రీమియం చెల్లించాలి. అంటే ఎంచుకున్న టర్మ్ నుంచి 4 ఏళ్లు మైనస్ చేసి మిగతా ఏళ్లు ప్రీమియం చెల్లిస్తే చాలు. ప్రీమియం నెలవారీ, లేదా క్వార్టర్లీ, అర్ధ సంవత్సరం లేదా ఏడాది ఒకసారి చెల్లించవచ్చు.
ప్రయోజనాలు ఇవి..
15 ఏళ్ల టర్మ్‌తో పాలసీ తీసుకున్నవారికి 13, 14వ ఏడాదిలో 25 శాతం చొప్పున రిటర్న్స్ వస్తాయి. ఇలాగే 20 ఏళ్ల టర్మ్ ఎంచుకున్న పాలసీకి 18, 19వ ఏడాదిలో 25 శాతం చొప్పున మనీబ్యాక్ వస్తుంది. 25 ఏళ్ల టర్మ్‌తో పాలసీ తీసుకుంటే 23, 24వ ఏడాదిలో 25 శాతం చొప్పున బెనిఫిట్ లభిస్తుంది.
ఉదాహరణ చూడండి.. ఓ వ్యక్తి 15ఏళ్ల కాల వ్యవధితో రూ. 5లక్షల అష్యూర్డ్‌తో ఎల్ఐసీ బీమారత్న పాలసీ తీసుకున్నాడనుకుందాం. అతనికి 13వ సంవత్సరంలో ఒకసారి, 14వ సంవత్సరంలో రెండోసారి 25 శాతం చొప్పున మనీబ్యాక్ వస్తుంది. దీంతో పాటు మొదటి ఐదేళ్లకు రూ.1,000 కి రూ.50 చొప్పున, 6 నుంచి 10 ఏళ్ల వరకు రూ.1,000 కి రూ.55 చొప్పున, ఆ తర్వాత మెచ్యూరిటీ వరకు వరకు రూ.1,000 కి రూ.60 చొప్పున బోనస్ వస్తుంది. ఇవన్నీ కలిపి మెచ్యూరిటీ సమయానికి అతనికి రూ.50 లక్షల వరకు రిటర్న్స్ వస్తాయి. అంటే ఎంచుకున్న సమ్ అష్యూర్డ్‌కు 10 రెట్ల రిటర్న్స్ అన్నమాట.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..