Lexus LM 350h: టీవీ, ఫ్రిడ్జ్‌ ఇంకా ఎన్నో.. రూ. 2 కోట్ల కారులో కళ్లు చెదిరే ఫీచర్స్‌

ఈ ఏడాది మార్చిలో లాంచ్‌ చేసిన ఈ కారు బుకింగ్స్‌ ఆగస్టు నుంచి మొదలయ్యాయి. ఇప్పటి వరకు ఈ కారు కోసం 100 బుకింగ్స్‌ వచ్చాయి. అయితే కంపెనీ తాజాగా బుకింగ్స్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. ముందుగా బుకింగ్స్ చేసుకున్న కార్ల విక్రయాలు జరిగిన తర్వాత మళ్లీ బుకింగ్స్‌ ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది. దీనిబట్టే ఈ కారుకు ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పొచ్చు..

Lexus LM 350h: టీవీ, ఫ్రిడ్జ్‌ ఇంకా ఎన్నో.. రూ. 2 కోట్ల కారులో కళ్లు చెదిరే ఫీచర్స్‌
Lexus Lm 350h
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 22, 2024 | 6:55 AM

మార్కెట్లో లగ్జరీ కార్లకు ఉన్న డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అధునాతన ఫీచర్లు, సౌకర్యాలతో కూడిన కార్లకు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఓ కారు మార్కెట్లో హల్చల్‌ చేస్తోంది. భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన జర్మన్‌ బ్రాండ్‌ వాహనాల్లో ఒకటైన లెక్సస్‌ ఇటీవల ‘లెక్సస్‌ ఎల్‌ఎమ్‌ 350హెచ్‌’ పేరుతో కొత్త కారును తీసుకొచ్చింది.

ఈ ఏడాది మార్చిలో లాంచ్‌ చేసిన ఈ కారు బుకింగ్స్‌ ఆగస్టు నుంచి మొదలయ్యాయి. ఇప్పటి వరకు ఈ కారు కోసం 100 బుకింగ్స్‌ వచ్చాయి. అయితే కంపెనీ తాజాగా బుకింగ్స్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. ముందుగా బుకింగ్స్ చేసుకున్న కార్ల విక్రయాలు జరిగిన తర్వాత మళ్లీ బుకింగ్స్‌ ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది. దీనిబట్టే ఈ కారుకు ఎంతలా డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే మళ్లీ బుకింగ్స్ ఎప్పుడు మొదలవుతాయన్న దానిపై కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఇక ఈ కారు ధర అక్షరాల రూ. 2 కోట్లు. అంతలా ఈ కారులో ఉన్న స్పెషాలిటీ ఏంటని ఆలోచిస్తున్నారు కదూ! నిజంగానే ఈకారులో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. విశాలమైన క్యాబిన్‌తో కూడిన ఈ లగ్జరీ కారులో పెద్ద ఫ్రంట్ గ్రిల్, హెడ్‌ల్యాంప్స్, అల్లాయ్ వీల్స్ వంటివి అందించారు. బ్లాక్, సోలిస్ అనే రెండు రంగుల్లో ఈ కారును తీసుకొచ్చారు. ఇక కారు ఇంటీరియర్‌ చూస్తే చిన్న సైజ్‌ గదిలాగే ఉంటుంది.

డ్యాష్‌ బోర్డ్‌లో 14 ఇంచెస్‌ టచ్‌స్క్రీన్ ఉంటే. వెనకాల ఒక పెద్ద స్క్రీన్‌, ఫోల్డ్‌ అవుట్ టేబుల్‌, హీటెడ్ ఆర్మ్‌రెస్ట్‌, రిఫ్రిజిరేటర్‌ వంటి ఎన్నో అధునాతన ఫీచర్లను అందించారు. ఇక యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లకు ఈ కారు సపోర్ట్ చేయడం విశేషం. అలాగే ఇందులో 23 స్పీకర్ ఆడియో సిస్టంను ఇచ్చారు. కారు ఇంజన్‌ విషయానికొస్తే ఇందులో 2.5 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజ్‌ను ఇచ్చారు. ఇది 190 Bhp, 240 Nm టార్క్ అందిస్తుంది. ఏడు సీట్ల లెక్సస్ ఎల్ఎమ్350 హెచ్ ధర రూ. 2 కోట్లు. అయితే ఇదే మోడల్ 4 సీటర్ ధర రూ. 2.5 కోట్లుగా నిర్ణయించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..