Maruti Suzuki Fronx: ఈ కారు మార్కెట్లో హాట్ కేకు.. 17 నెలల్లోనే రికార్డు స్థాయి అమ్మకాలు..
మారుతి సుజుకీ కార్లకు మన దేశంలో అధిక గిరాకీ ఉంటుంది. ఇది ఏటా అమ్ముడవుతున్న కార్ల జాబితాను చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. అయితే ఆ కార్లలో చిన్న కార్లు ఎక్కువగా ఉంటాయి. అయితే ఎస్‌యూవీల్లో మాత్రం ఈ కంపెనీ కార్లకు అంత డిమాండ్ ఉండదు. అయితే ఇటీవల విడుదలైన మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ ఎస్‌యూవీ ఆ పాత రికార్డులను చేరిపేస్తోంది. ఇది ప్రారంభమైన ఏడాదిలోనే రికార్డు స్థాయిలో అమ్మకాలు చేసి కొత్త చరిత్రను సృష్టించింది. 17 నెలల కాలంలోనే ఏకంగా 2 లక్షల యూనిట్లను విక్రయించి మార్కెట్లో సన్సేషన్ సృష్టించింది. ఈ నేపథ్యంలో మారుతీ సుజుకీ ఫ్రాంక్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
