Watch Video: ఇకపై డ్రోన్లతో పోస్టల్ పార్శిల్స్ డెలివరీ.. విజయవంతమైన ట్రయల్ రన్.. ఎక్కడంటే?
India Post Drone Parcel: డ్రోన్ ద్వారా తపాలా సేవలను ప్రారంభించేందుకు భారత తపాలా శాఖ ఒక ట్రయల్ నిర్వహించింది. ఇందులో భుజ్ తహసిల్‌లోని హబే పోస్టాఫీసు నుంచి భచౌ తహసిల్‌లోని నెర్ గ్రామ పోస్టాఫీసు వరకు..
ఇండియన్ పోస్టల్ సర్వీస్ దేశంలోనే తొలిసారిగా డ్రోన్ ద్వారా పోస్టల్ పార్శిళ్లను డెలివరీ చేసింది. ఈ డెలివరీ గుజరాత్‌లోని కచ్‌లో చేపట్టింది. డ్రోన్ కేవలం 25 నిమిషాల వ్యవధిలో 47 కిలోమీటర్ల దూరంలో పార్శిల్‌ను డెలివరీ చేసింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్రోన్ ద్వారా రెండు కిలోల పోస్టల్ పార్శిల్ డెలివరీ చేశారు. ఇప్పటి వరకు ఫోటోగ్రఫీకి డ్రోన్‌లను ఉపయోగించేవారు. కానీ, తొలిసారి పోస్టల్ పార్శిళ్లను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి పంపడానికి ఉపయోగిస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద, సరిహద్దు జిల్లా అయిన కచ్‌లో తపాలా శాఖ ఒక కొత్త విజయవంతమైన ప్రయోగం చేసింది. ఇక్కడ డ్రోన్ ద్వారా రెండు కిలోల పార్శిల్ విజయవంతంగా డెలివరీ చేసి రికార్డు నెలకొల్పారు.
25 నిమిషాల్లో 47 కి.మీ..
డ్రోన్ ద్వారా తపాలా సేవలను ప్రారంభించేందుకు భారత తపాలా శాఖ ఒక ట్రయల్ నిర్వహించింది. ఇందులో భుజ్ తహసిల్‌లోని హబే పోస్టాఫీసు నుంచి భచౌ తహసిల్‌లోని నెర్ గ్రామ పోస్టాఫీసు వరకు 47 కి.మీ మార్గాన్ని ఎంపిక చేసి రెండు కిలోల పొట్లాలను డ్రోన్ ద్వారా పంపారు. ఈ డ్రోన్ పార్శిల్ 47 కి.మీ దూరాన్ని కేవలం 25 నిమిషాల్లోనే చేరుకుని ఆశ్చర్యపరిచింది.
డ్రోన్ సర్వీస్ త్వరలో ప్రారంభం కావొచ్చు..
ఈ పరీక్షలో, డ్రోన్‌లో మందు పార్శిల్ లోడ్ చేశారు. ఇది డ్రోన్ ద్వారా 25 నిమిషాల్లో 47 కిలోమీటర్ల దూరాన్ని హబే గ్రామం నుంచి నెర్ గ్రామం వరకు విజయవంతంగా ల్యాండ్ చేశారు. ట్రయల్ బేస్ ధృవీకరణ తర్వాత, ప్రభుత్వం నుంచి అధికారిక సమాచారం వచ్చాక డ్రోన్ పోస్టల్ సేవను ప్రారంభించవచ్చని తెలుస్తోంది.
ఢిల్లీ నుంచి నలుగురు సభ్యుల బృందం హాజరు..
స్థానిక తపాలా శాఖ అధికారులతోపాటు ఉన్నత స్థాయి బృందం సమక్షంలో పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష కోసం ఢిల్లీ నుంచి నలుగురు సభ్యుల బృందం కూడా వచ్చింది. డోర్‌స్టెప్ బ్యాంకింగ్ తర్వాత, పోస్టల్ శాఖ ఇప్పుడు డ్రోన్ డెలివరీ వంటి ఆధునికత వైపు వెళుతోంది.
.@IndiaPostOffice tested parcel delivery using drone in Gujarat. #DroneForDelivery pic.twitter.com/CB8SC8Vfd0
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) May 31, 2022