Postal Scheme : లక్ష పెట్టుబడితో మరో లక్ష రాబడి.. పోస్టాఫీస్‌లో అందించే డబుల్ ఇన్‌కమ్ స్కీమ్ ఇదే..!
. కిసాన్ వికాస్ పత్ర పేరుతో ప్రభుత్వ భరోసాతో ఓ పొదుపు పథకాన్ని అమలు చేస్తుంది. ఇందులో నిర్ధిష్ట మొత్తంలో పెట్టుబడి పెడితే కొన్ని సంవత్సరాల తర్వాత మన సొమ్ము డబుల్ అవుతుంది. ఈ పథకం ఎప్పటి నుంచో అందుబాటులో ఉన్నా ప్రస్తుతం ఆర్‌బీఐ రెపో రేట్లను సవరించిన నేపథ్యంలో ఈ పథకంపై అధిక రాబడిని ఖాతాదారులకు అందిస్తుంది.
కష్టపడి సంపాదించిన డబ్బును ఎలాంటి ఇబ్బంది లేకుండా పెట్టుబడి పెట్టాలని కోరుకుంటాం. మన సొమ్ముకు భద్రతతో పాటు అధిక రాబడి రావాలనుకుంటాం. అలాగే పెట్టుబడి పెట్టే సమయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలనుకుంటాం. ఇలాంటి వారి కోసమే ఇండియన్ పోస్ట్స్ ఓ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. కిసాన్ వికాస్ పత్ర పేరుతో ప్రభుత్వ భరోసాతో ఓ పొదుపు పథకాన్ని అమలు చేస్తుంది. ఇందులో నిర్ధిష్ట మొత్తంలో పెట్టుబడి పెడితే కొన్ని సంవత్సరాల తర్వాత మన సొమ్ము డబుల్ అవుతుంది. ఈ పథకం ఎప్పటి నుంచో అందుబాటులో ఉన్నా ప్రస్తుతం ఆర్‌బీఐ రెపో రేట్లను సవరించిన నేపథ్యంలో ఈ పథకంపై అధిక రాబడిని ఖాతాదారులకు అందిస్తుంది. ఈ పథకం గురించి అదనపు వివరాలను ఓ సారి తెలుసుకుందాం.
కిసాన్ వికాస్ పత్ర పథకంలో పెట్టుబడి పెడితే పది సంవత్సరాల తర్వాత మీ పెట్టుబడి డబుల్ అవుతుంది. అలాగే పెట్టుబడి గరిష్ట పరిమితి లేదు. కనిష్ట పెట్టుబడి మాత్రం రూ.1000 నుంచి ప్రారంభం అవుతుంది. 1000తో గుణించగల ఎంత సొమ్ము అయినా ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో ఎక్కువగా 7.2 శాతం వార్షిక వడ్డీను అందిస్తారు. దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న లక్షా యాబై వేల పోస్టాఫీసుల్లో ఎక్కడైనా ఈ పథకంలో జాయిన్ అవ్వవచ్చు. ఈ పొదుపు పథకంలో పెట్టుబడి పెడితే 120 నెలల కాలానికి మీ డిపాజిట్ సొమ్ము డబుల్ అవుతుంది. కేవీపీ వడ్డీ రేట్లు త్రైమాసిక ప్రాతిపదికన సమీక్షిస్తూ ఉంటారు.అయితే గతంలో 124 నెలలకు డబుల్ అయ్యే డిపాజిట్ ఆర్‌బీఐ చర్యల కారణంగా 120 నెలలకే డబుల్ అవుతుంది.
కేవీపీ పథకానికి అర్హత
కేవీపీ ఖాతాను 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు ఒంటరిగా లేదా సంయుక్తంగా (ముగ్గురు వ్యక్తుల వరకు) తీసుకోవచ్చు. పది సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మైనర్‌కు అనుకూలంగా సంరక్షకుడు కూడా ఖాతాను తెరిచే అవకాశం ఉంది.
కేవీపీ లాక్ఇన్ పిరియడ్
పోస్ట్ ఆఫీస్ వెబ్‌సైట్ ప్రకారం, కిసాన్ వికాస్ పత్ర పథకంలో పెట్టుబడి డిపాజిట్ తేదీ నుంచి రెండు సంవత్సరాల ఆరు నెలల కాలానికి లాక్ చేసి ఉంటుంది. ఏదేమైనప్పటికీ, ఖాతాదారుని మరణం, గెజిట్ అధికారి ప్రతిజ్ఞ ద్వారా జప్తు చేయడం లేదా కోర్టు ద్వారా ఆర్డర్ వంటి నిర్దిష్ట పరిస్థితులలో అకాల మూసివేత అనుమతిస్తారు. అయితే కేవీపీలో పెట్టిన పెట్టుబడిని హామీనిస్తూ రుణం పొందే సౌకర్యం ఉంది. కేవీపీ మెచ్యూరిటీ ఉపసంహరణ సమయంలో టీడీఎస్ మినహాయింపు ఉన్నా రిటర్న్స్‌లో మాత్రం పన్ను విధిస్తారని గుర్తుంచుకోవాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి