Credit Card: క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నారా.. ఆనందంతో ఊగిపోకండి.. దాని వెనుక ఏ ముందో ఓసారి చూడండే..

క్రెడిట్ కార్డ్‌ని మీరు తీసుకుంటున్నట్లైతే కొన్ని విషయాలను జాగ్రత్తగా తెలుసుకోండి. మీకు కనిపించకుండా అదనపు ఛార్జీల గురించి తప్పకుండా తెలుసుకోండి. వీటి గురించి తెలుసుకోకుంటే అవి మీ జేబును ఖాళీ చేయగలవు.

Credit Card: క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నారా.. ఆనందంతో ఊగిపోకండి.. దాని వెనుక ఏ ముందో ఓసారి చూడండే..
Credit Card
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 05, 2023 | 6:41 PM

క్రెడిట్ కార్డ్ డబ్బు లేనప్పుడు కూడా కొనుగోళ్లు చేసే సదుపాయాన్ని ఇస్తుంది. ప్రతి నెలా వాయిదాగా డబ్బును వసూలు చేస్తుంది. ఒక క్రెడిట్ కార్డ్ అనేది ఒక ప్రీ-సెట్ క్రెడిట్ పరిమితితో బ్యాంకుల ద్వారా జారీ చేయబడిన ఒక ఆర్థిక సాధనం. ఇది మీకు నగదురహిత లావాదేవీలు చేయడానికి సహాయపడుతుంది. కార్డ్ జారీచేసేవారు మీ క్రెడిట్ స్కోర్, క్రెడిట్ హిస్టరీ, బ్యాంక్ లావాదేవీలు, మీ ఆదాయం ఆధారంగా క్రెడిట్ పరిమితిని నిర్ణయిస్తారు. అదే సూచికతో మీకు క్రెడిట్ కార్డును అందిస్తారు. ఈ మధ్యకాలంలో క్రెడిట్ కార్డులను ఉపయోగించేవారి సంఖ్య చాలా పెరిగింది. అయితే, క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తున్నప్పుడు.. కొన్ని విషయాలు తప్పకుండా తెలుసకోవాలి. అందులో అనేక ఛార్జీలు ఇవ్వబడుతాయి. వాటి గురించి క్రెడిట్ కార్డు వినియోగించేవారికి అస్సలు తెలియదు.

కార్డ్ జారీ చేసే సంస్థ దాని గురించి తెలియజేయదు అని కూడా చెప్పవచ్చు. క్రెడిట్ కార్డ్‌లపై వడ్డీ, ఆలస్య చెల్లింపు, ప్రాసెసింగ్ ఫీజులు కాకుండా, అనేక ఛార్జీలు విధించబడతాయి. వీటిని మీరు తెలుసుకోవాలి. మీరు దీన్ని తెలియకుండా ఉపయోగిస్తే.. మీరు కూడా భారీ నష్టాలను ఎదుర్కోవచ్చు లేదా మీ జేబు ఖాళీగా మారవచ్చు. ఇందులో కొన్ని ముఖ్యమైన ఛార్జీల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

నిర్వహణ ఛార్జీలు..

చాలా కంపెనీలు క్రెడిట్ కార్డుల కోసం నిర్వహణ ఖర్చు అంటే  వసూలు చేస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ ఛార్జీలు వార్షికంగా ఉండవచ్చు. మీరు యాక్టివ్‌గా ఉంటే ఈ ఛార్జీ సున్నా కావచ్చు లేదా మీరు అనేక రివార్డ్ పాయింట్‌లతో ఈ ఛార్జీని చెల్లించవచ్చు. మీరు దీన్ని చాలా కంపెనీల కార్డులతో పోల్చవచ్చు.

నగదుపై ముందస్తు రుసుము

మీరు క్రెడిట్ కార్డ్ సహాయంతో ATM నుంచి డబ్బు తీసుకోవచ్చు. అయితే, దీనికి మీకు ఛార్జీ విధించబడుతుంది. మీరు క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తున్నప్పుడు నగదును విత్‌డ్రా చేయకుండా ప్రయత్నించాలి.

ఆలస్యంగా చెల్లింపు

క్రెడిట్ కార్డ్‌పై వాయిదాలను ఆలస్యంగా చెల్లించినందుకు ఛార్జీ విధించబడుతుంది లేదా పెనాల్టీ విధించబడుతుంది. ఈ జరిమానా ఎక్కువగా ఉండవచ్చు. ఇలాంటి ఛార్జీలను తప్పించుకోవాలని అనుకుంటే మాత్రం వాయిదాలను సకాలంలో చెల్లించాల్సిన అవసరం ఉంది.

GST ఛార్జ్

అన్ని క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై 18% GST విధించబడుతుంది.

విదేశాలకు డబ్బు పంపుతున్నారా..

క్రెడిట్ కార్డు సహాయంతో విదేశాలకు డబ్బు పంపితే చాలా డబ్బు వసూలు చేస్తారు. ఈ ఛార్జీ బదిలీ చేయబడిన మొత్తంలో 1% లేదా అంతకంటే ఎక్కువ కావచ్చు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం

సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?