Kinetic E-Luna: లూనా మోపెడ్ రీఎంట్రీకి అంతా సెట్.. కేవలం రూ. 500కే బుక్ చేసుకోండి..
ఇప్పుడు మళ్లీ ఈ లూనా రీ ఎంట్రీ ఇస్తోంది. ఎలక్ట్రిక్ వేరియంట్లో లాంచ్ కానుంది. కైనెటిక్ గ్రీన్ కంపెనీ ఓల్డ్ లూనాకే లేటెస్ట్ టచ్ ఇచ్చి ఈ-లూనా మల్టీ యుటిలిటీ ఈ2డబ్ల్యూగా వచ్చే నెల ప్రారంభంలో మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. ఈ స్కూటర్‌కు సంబంధించిన బుకింగ్ సైతం జనవరి 26 నుంచి ప్రారంభించింది. కైనెటిక్ గ్రీన్ వెబ్ సైట్లో రూ. 500 చెల్లించి దీనిని బుక్ చేసుకోవచ్చు.
కైనెటిక్ లూనా.. ఇప్పటి తరానికి ఈ పేరు అంతగా పరిచయం లేదు గానీ 1970ల్లో అదొక ట్రెండింగ్ బైక్. ఎవరైనా మోపెడ్ అంటే అది లూనా మాత్రమే. ప్రతి ఒక్కరి ఇంట్లో అది కనిపిస్తుండేది. పెట్రోల్‌తో నడిచే ఈ లూనా ఆ తర్వాత కాలంలో ఉత్పత్తిని నిలిపివేశారు. కాగా ఇప్పుడు మళ్లీ ఈ లూనా రీ ఎంట్రీ ఇస్తోంది. ఎలక్ట్రిక్ వేరియంట్లో లాంచ్ కానుంది. కైనెటిక్ గ్రీన్ కంపెనీ ఓల్డ్ లూనాకే లేటెస్ట్ టచ్ ఇచ్చి ఈ-లూనా మల్టీ యుటిలిటీ ఈ2డబ్ల్యూగా వచ్చే నెల ప్రారంభంలో మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. ఈ స్కూటర్‌కు సంబంధించిన బుకింగ్ సైతం జనవరి 26 నుంచి ప్రారంభించింది. కైనెటిక్ గ్రీన్ వెబ్ సైట్లో రూ. 500 చెల్లించి దీనిని బుక్ చేసుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే దీనిని ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం ఫ్లిప్ కార్ట్ లిస్టింగ్ ఇచ్చింది. ఈ క్రమంలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
మేడ్ ఇన్ ఇండియా.. మేడ్ ఫర్ ఇండియా..
కైనెటిక్ గ్రీన్ వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన సులజ్జ ఫిరోడియా మోత్వాని మాట్లాడుతూ ఐకానిక్ లూనా సరికొత్త ఎలక్ట్రిక్ అవతార్‌లో పునరాగమనం చేస్తోందని ప్రకటించడానికి తాము సంతోషిస్తున్నామన్నారు. కైనెటిక్ గ్రీన్ మెమరీ లేన్‌లో ప్రయాణాన్ని ప్రారంభించిందని, ఈ-లూనాను 2024 ఫిబ్రవరిలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. గణతంత్ర దినోత్సవం సందర్బంగా జనవరి 26న బుకింగ్‌లు ఆరంభిస్తున్నట్లు వెల్లడించారు. మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియా స్కూటర్ అని ప్రకటించారు. మెట్రో, టైర్ 1 పట్టణాలలో మాత్రమే కాకుండా భారతదేశంలోని టైర్-2, టైర్-3 నగరాలు మరియు గ్రామీణ మార్కెట్‌ల కోసం వినియోగదారుల రహదారి పరిస్థితులు, డ్రైవింగ్ అవసరాలకు అనుగుణంగా ఈ-లూనా ధృడమైన, మన్నికైన విధానంలో రూపొందిందన్నారు. సంప్రదాయ పెట్రోల్ ద్విచక్ర వాహనాలకు సమర్థవంతమైన ప్రత్యామ్నాయాన్ని అందించడానికి దీనిని రూపొందించామన్నారు. ఆకట్టుకునే సాంకేతిక లక్షణాలు, పనితీరు సామర్థ్యాలు, పటిష్టమైన ఫీచర్లు ఇందులో ఉంటాయని చెప్పారు.
ఎక్కడ తయారీ..
కైనెటిక్ గ్రీన్ కంపెనీ ఇప్పటికే ఈ-లూనా తయారీని ప్రారంభించింది. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ తో కంపెనీకి చెందిన ప్లాంట్లో ప్రతి నెలా 5000యూనిట్లను తయారు చేస్తోంది. అంతేకాక ప్రస్తుతం కైనెటిక్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ఈ కామర్స్ వెబ్ సైట్లో లిస్ట్ అయ్యి ఉంది. దీని అసలు ధర రూ. 73,990(ఎక్స్ షోరూం)కాగా.. ఫ్లిప్ కార్టలో రూ. 2000 తక్కువకే రూ. 71,990(ఎక్స్ షోరూం)కి కొనుగోలు చేయొచ్చని పేర్కొంది.
ఈ-లూనా స్పెసిఫికేషన్లు..
కైనెటిక్ ఈ-లూనాకు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు కంపెనీ ఇంకా ప్రకటించ లేదు. అయితే 2కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీతో వస్తుందని చెబుతున్నారు. అలాగే రేంజ్ సింగిల్ చార్జ్ పై 110 కిలోమీటర్లు ఉండే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..