AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ola Taxi: ఓలా సంస్థ సరికొత్త నిర్ణయం.. ఈ నగరాల్లో తక్కువ ధరలకే బైక్ ట్యాక్సీ సేవలు..

ఓలా ప్రముఖ ఈ బైక్ సంస్థ. ఈ సంస్థ తన ఈ బైక్ క్యాబ్ సర్వీసులను ఢిల్లీ, హైదరాబాద్ లలో విస్తరించేందుకు ప్రణాళికలు సిద్దం  చేసింది. గతంలో బెంగళూరులో ఈ బైక్ క్యాబ్ అందుబాటులోకి తెచ్చి విజయం సాధించింది. దీంతో తన మార్కెట్ సేవలను మరిన్ని ప్రాధాన నగరాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

Ola Taxi: ఓలా సంస్థ సరికొత్త నిర్ణయం.. ఈ నగరాల్లో తక్కువ ధరలకే బైక్ ట్యాక్సీ సేవలు..
Ola Bykes
Srikar T
|

Updated on: Jan 27, 2024 | 6:50 AM

Share

బెంగళూరు, జనవరి 27: ఓలా ప్రముఖ ఈ-బైక్ సంస్థ. ఈ సంస్థ తన ఈ బైక్ క్యాబ్ సర్వీసులను ఢిల్లీ, హైదరాబాద్ లలో విస్తరించేందుకు ప్రణాళికలు సిద్దం  చేసింది. గతంలో బెంగళూరులో ఈ బైక్ క్యాబ్ అందుబాటులోకి తెచ్చి విజయం సాధించింది. దీంతో తన మార్కెట్ సేవలను మరిన్ని ప్రాధాన నగరాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఒక బిలియన్ (10 లక్షల) ప్రజలకు సేవలు అందించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. ఎలక్ట్రానిక్ బైకులతో దేశ ట్రాన్స్ పోర్టు రంగంలో ఒక విప్లవం సృష్టించాలని యోచిస్తోంది. అందుకోసం వచ్చే రెండు నెలల్లో 10,000 ఈ బైక్ లను దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలనుకుంటోంది. ఈ సంస్థకు చెందిన ఈ బైక్ ట్యాక్సీని బుక్ చేసుకుంటే అతి తక్కువ ధరకే ప్రయాణ సేవలు అందిస్తోంది. 5 కిలో మీటర్ల పరిధి వరకు రూ. 25, 10 కిలో మీటర్ల పరిధి వరకు రూ. 50, 15 కిలో మీటర్ల పరిధి వరకు రూ. 75గా నిర్ణయించింది. దీంతో ఈ బైకు సేవలను వినియోగించుకునేందుకు పోటీ పడుతున్నారు వినియోగదారులు.

ఓలా మొబిలిటీ సీఈఓ హేమంత్ బక్షి మీడియా సమావేశంలో మాట్లాడారు. పర్యావరణానికి అనుకూలంగా ఒక బిలియన్ (10 లక్షల) భారతీయులకు సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. తక్కువ ధరతో సౌకర్యవంతమైన ప్రయాణం సాగించే వెసులుబాటు కల్పించామన్నారు. ఈ సరికొత్త విధానం ద్వారా గిగ్ కార్మికులకు ఉపాధి అవకాశాలు పుష్కలంగా అందించామన్నారు. 2023 సెప్టెంబర్ నెలలో ఇ బైక్ టాక్సీ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చి విజయం సాధించామన్నారు. కేవలం మూడు నెలల వ్యవధిలోనే 40 శాతం మార్కెట్ ను విస్తరించామన్నారు. రానున్న రోజుల్లో దీనిని రెట్టింపు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. బెంగళూరులో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ సేవల కోసం 200 ఛార్జింగ్ పాయింట్లు కూడా అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఈ 5 ఆదాయాలపై ఒక్క రూపాయి కూడా ట్యాక్స్‌ ఉండదు..!
ఈ 5 ఆదాయాలపై ఒక్క రూపాయి కూడా ట్యాక్స్‌ ఉండదు..!
చైత్ర నవరాత్రులలో దీపం వెలిగించడానికి శుభప్రదమైన ప్రదేశాలు..
చైత్ర నవరాత్రులలో దీపం వెలిగించడానికి శుభప్రదమైన ప్రదేశాలు..
HYDలో అనిరుధ్ మ్యూజికల్ కన్సర్ట్ కు వెళుతున్నారా? ఇది మీకోసమే
HYDలో అనిరుధ్ మ్యూజికల్ కన్సర్ట్ కు వెళుతున్నారా? ఇది మీకోసమే
ఖతర్నాక్ కంత్రీగాడు..గోల్డ్ షాపులో ఏం చేస్తున్నాడో చూడండి! వీడియో
ఖతర్నాక్ కంత్రీగాడు..గోల్డ్ షాపులో ఏం చేస్తున్నాడో చూడండి! వీడియో
పర్యావరణాన్ని కాపాడుతూనే మీ ఇంటికి రాయల్ లుక్ ఇవ్వడం ఎలా?..
పర్యావరణాన్ని కాపాడుతూనే మీ ఇంటికి రాయల్ లుక్ ఇవ్వడం ఎలా?..
చిన్నపాపను ఇంటికి పిలిచి భోజనం పెట్టిన విరోష్ జంట
చిన్నపాపను ఇంటికి పిలిచి భోజనం పెట్టిన విరోష్ జంట
అదంతా ఫేక్! ఆ వీడియోపై గరికపాటి నరసింహారావు క్లారిటీ
అదంతా ఫేక్! ఆ వీడియోపై గరికపాటి నరసింహారావు క్లారిటీ
సాధారణ పెట్రోల్ కంటే ప్రీమియం పెట్రోల్ ఎందుకు ఖరీదైనది? తేడా ఏంటి
సాధారణ పెట్రోల్ కంటే ప్రీమియం పెట్రోల్ ఎందుకు ఖరీదైనది? తేడా ఏంటి
తెలంగాణలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు రద్దు.. వచ్చే ఏడాది నుంచే అమలు!
తెలంగాణలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు రద్దు.. వచ్చే ఏడాది నుంచే అమలు!
తేజ సజ్జా టు కిరణ్ అబ్బవరం..రూటు మారుస్తోన్న కుర్ర హీరోలు
తేజ సజ్జా టు కిరణ్ అబ్బవరం..రూటు మారుస్తోన్న కుర్ర హీరోలు