Budget 2024: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వారికి ఈ బడ్జెట్‌లో తీపి కబురు ఉంటుందా?
ఎగుమతుల కోసం తక్కువ వడ్డీ రుణాలు ఇవ్వడం లేదా ఎలాంటి తనఖా లేకుండా రుణాలు ఇవ్వగలిగితే, ప్రభుత్వం రుణాలపై ఏదైనా మారటోరియం ఇవ్వగలిగితే కాని పరిస్థితులు సానుకూలంగా మారవు. ఇక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. వ్యాపారంలో అగ్నిమాపక, కార్మిక, కాలుష్యం, ఈపీఎఫ్‌వో.. ఇలా 30కి పైగా విభాగాల నుంచి అనుమతులు తీసుకోవాలి. వ్యాపారవేత్తల సమయాన్ని..
బడ్జెట్ సమావేశాలు రాబోతున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీని ఆర్థిక శాఖమంత్రి నిర్మలాసీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో చాలా మందికి ఆశలు రేకెత్తుతున్నాయి. బ్యాంకుల్లో రుణాలపై వడ్డీ తగ్గింపు, ఆదాయపు పన్ను శాఖ నుంచి పన్ను మినిహాయింపులు, అలాగే చిన్న పరిశ్రమల వారికి బ్యాంకు వడ్డీరేట్ల తగ్గింపు ప్రకటనలు రావాలని కోరుతున్నారు. అలాగే వివిధ పరిశ్రమల్లో తయారు చేస్తున్న వస్తువులు ముడి పదార్థాల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నందున వారికి ఉపశమనం కలిగించే ఏదైనా ప్రకటన చేయాలని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ముడి పదార్థాల ధరలు కూడా ద్రవ్యోల్బణం కారణంగా పెరుగుతున్నాయి. అధిక ఖర్చులు, ఎక్కువ వడ్డీ రుణాల వల్ల లాభాలను సాధించడం కష్టతరంగా మారుతోంది.చి
ఎగుమతుల కోసం తక్కువ వడ్డీ రుణాలు ఇవ్వడం లేదా ఎలాంటి తనఖా లేకుండా రుణాలు ఇవ్వగలిగితే, ప్రభుత్వం రుణాలపై ఏదైనా మారటోరియం ఇవ్వగలిగితే కాని పరిస్థితులు సానుకూలంగా మారవు. ఇక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. వ్యాపారంలో అగ్నిమాపక, కార్మిక, కాలుష్యం, ఈపీఎఫ్‌వో.. ఇలా 30కి పైగా విభాగాల నుంచి అనుమతులు తీసుకోవాలి. వ్యాపారవేత్తల సమయాన్ని ఆదా చేసేందుకు ప్రభుత్వం అవసరమైన అనుమతులను తగ్గించాలని కోరుతున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వారికి ఎన్నో సమస్యలుండగా, ఈ బడ్జెట్‌లో పరిష్కరించే దిశగా నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు. మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందనే దానిపై ఈ వీడియోలో తెలుసుకుందాం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి