LPG Gas E-Kyc: ఆ గ్యాస్ కనెక్షన్లను తొలగించేందుకు కీలక చర్యలు.. ఈ-కేవైసీతో ఆ సమస్య ఫసక్..!

భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో ఎల్‌పీజీ కనెక్షన్ కచ్చితంగా ఉంటుంది. గతంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కట్టెల పొయ్యిపై వంట చేసుకునేవారు. అయితే భారత ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు అందరికీ అందుబాటులోకి గ్యాస్ కనెక్షన్లను తీసుకొచ్చింది. కొన్ని ప్రత్యేక పథకాల ద్వారా గృహ వినియోగదారులకు గ్యాస్ కనెక్షన్లను అందించింది. అయితే హోటల్స్, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ వంటి అవసరాలకు వాణిజ్య కనెక్షన్లను తీసుకోవాలి. కానీ కొంత మంది నకిలీ గ్యాస్ కనెక్షన్లతో గృహ ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్లను దుర్వినియోగం చేస్తున్నారని ఇటీవల ప్రభుత్వం గుర్తించింది.

LPG Gas E-Kyc: ఆ గ్యాస్ కనెక్షన్లను తొలగించేందుకు కీలక చర్యలు.. ఈ-కేవైసీతో ఆ సమస్య ఫసక్..!
Gas Cylinder
Follow us
Srinu

|

Updated on: Jul 12, 2024 | 4:15 PM

భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో ఎల్‌పీజీ కనెక్షన్ కచ్చితంగా ఉంటుంది. గతంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కట్టెల పొయ్యిపై వంట చేసుకునేవారు. అయితే భారత ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు అందరికీ అందుబాటులోకి గ్యాస్ కనెక్షన్లను తీసుకొచ్చింది. కొన్ని ప్రత్యేక పథకాల ద్వారా గృహ వినియోగదారులకు గ్యాస్ కనెక్షన్లను అందించింది. అయితే హోటల్స్, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ వంటి అవసరాలకు వాణిజ్య కనెక్షన్లను తీసుకోవాలి. కానీ కొంత మంది నకిలీ గ్యాస్ కనెక్షన్లతో గృహ ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్లను దుర్వినియోగం చేస్తున్నారని ఇటీవల ప్రభుత్వం గుర్తించింది. కాబట్టి ఎల్‌పీజీ కస్టమర్‌లను ధ్రువీకరించడానికి, నకిలీ ఖాతాలను తొలగించడానికి ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీలు ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ ప్రమాణీకరణను ఉపయోగిస్తున్నాయని చమురు మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. రెసిడెన్షియల్ పేర్లతో వంట గ్యాస్‌ను బుక్ చేసుకుని వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించే మోసపూరిత కస్టమర్‌లను గుర్తించి తొలగించడమే లక్ష్యంగా ప్రభుత్వ ఈ చర్య తీసుకుంది. ఈ నేపథ్యంలో ఎల్‌పీజీ ఈ-కేవైసీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీశన్ కేంద్రం నిర్ణయం వల్ల సామాన్యులకు ఇబ్బందిపడుతున్నారని పేర్కొనడంతో కేంద్రం స్పందించింది. ఈ ప్రక్రియ ఎనిమిది నెలలుగా అమల్లో ఉందని, ఈ-కేవైసీకు చివరి తేదీ అంటూ ఏదీ లేదని పేర్కొన్నారు. ఎల్‌పీజీ డెలివరీ సిబ్బంది, వినియోగదారులకు రీఫిల్‌లను పంపిణీ చేస్తున్నప్పుడు ఆధారాలను ధ్రువీకరిస్తారని ప్రభుత్వం పేర్కొంది. డెలివరీ సిబ్బంది తమ మొబైల్ ఫోన్‌ను ఉపయోగించి కస్టమర్‌కు సంబంధించిన ఆధార్ ఆధారాలను యాప్ ద్వారా క్యాప్చర్ చేస్తారు. కస్టమర్ ప్రాసెస్‌ను పూర్తి డెలివరీ సిబ్బందికి ఓటీపీ చెప్పాల్సి ఉంటుంది. అయితే ఆ సమయంలో కస్టమర్ అందుబాటులో లేకపోతే డిస్ట్రిబ్యూటర్‌ను కూడా సంప్రదించాలని వివరించారు.  ముఖ్యంగా వినియోగదారులు చమురు కంపెనీ యాప్‌లను కూడా ఇన్‌స్టాల్ చేసుకుని ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని వివరిస్తున్నారు. 

చమురు మార్కెటింగ్ కంపెనీలతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యాచరణకు గడువు లేదని స్పష్టం చేశాయి. ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్‌షిప్‌ల షోరూమ్‌లలో కస్టమర్ల “మస్టరింగ్” లేదని ఓఎంసీలు చెబుతున్నాయి. వినియోగదారులకు భరోసా ఇవ్వడానికి, నిజమైన వినియోగదారుకు ఎటువంటి ఇబ్బందులు లేదా అసౌకర్యం కలగకుండా చూసేందుకు చమురు కంపెనీలు ఈ విషయంలో ఒత్తిడి చేయమని ప్రభుత్వం స్పష్టం చేసింది. చమురు మంత్రిత్వ శాఖ పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ డేటా ప్రకారం భారతదేశంలో 32.64 కోట్ల మంది క్రియాశీల దేశీయ ఎల్‌పీజీ వినియోగదారులు ఉన్నారు. ప్రస్తుతం డొమెస్టిక్ ఎల్‌పీజీ 14.2 కిలోల సిలిండర్‌ను రూ. 803గా ఉంటే 19 కిలోల కమర్షియల్ సిలిండర్‌ను రూ. 1,646గా ఉంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..