AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ITR Filing: 75 ఏళ్లు దాటితే ఐటీఆర్ అవసరం లేదా? నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..

ఆదాయపు పన్నుచట్టం ప్రకారం 75 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు కలిగిన సీనియర్ సిటిజన్లు ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడం నుంచి మినహాయింపు పొందుతారు. అయితే దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. సాధారణంగా ఆర్థిక సంవత్సరంలో 2.50 లక్షలకు మించి ఆదాయం సంపాదించే 60 ఏళ్ల లోపు వారందరూ తప్పనిసరిగా ఐటీఆర్ ఫైల్ చేయాలి. పాత, కొత్త పన్ను విధానాలలో ఈ ప్రాథమిక మినహాయింపు పరిమితి అలాగే ఉంటుంది.

ITR Filing: 75 ఏళ్లు దాటితే ఐటీఆర్ అవసరం లేదా? నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..
Tax Rules
Madhu
|

Updated on: Jul 12, 2024 | 4:29 PM

Share

ఆదాయపు పన్ను చెల్లింపుదారులందరూ ఇన్ కం ట్యాక్స్ రిటర్న్స్ సమర్పించడానికి గడువు దగ్గరపడుతోంది. జూలై 31 వరకూ మాత్రమే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అందరూ ఐటీఆర్ తయారీలో బిజీగా ఉన్నారు. అయితే సీనియర్ సిటిజన్లు, సూపర్ సీనియర్ సిటిజన్లకు దీనిలో కొన్ని మినహాయింపులు లభిస్తాయి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం వారికి ఆ ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి ఐటీఆర్ దాఖలు చేసే ముందు తమకు లభించే పన్ను రాయితీలు, మినహాయింపులు తెలుసుకోవడం చాలా అవసరం.

నిబంధనలు..

ఆదాయపు పన్నుచట్టం ప్రకారం 75 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు కలిగిన సీనియర్ సిటిజన్లు ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడం నుంచి మినహాయింపు పొందుతారు. అయితే దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. సాధారణంగా ఆర్థిక సంవత్సరంలో 2.50 లక్షలకు మించి ఆదాయం సంపాదించే 60 ఏళ్ల లోపు వారందరూ తప్పనిసరిగా ఐటీఆర్ ఫైల్ చేయాలి. పాత, కొత్త పన్ను విధానాలలో ఈ ప్రాథమిక మినహాయింపు పరిమితి అలాగే ఉంటుంది. అలాగే సీనియర్ సిటీజన్లకు రూ.3 లక్షలు, సూపర్ సీనియర్ సిటిజన్లకు రూ.5 లక్షల వరకూ మినహాయింపు లభిస్తుంది.

మినహాయింపులు..

గతం ఆర్థిక సంవత్సరంలో 60 ఏళ్ల నిండి 80 ఏళ్ల లోపు వయసున్న వారిని సీనియర్ సిటిజన్లుగా నిర్ణయిస్తారు. అలాగే 80 ఏళ్లు నిండిన వారు సూపర్ సీనియర్ సిటిజన్లగా భావిస్తారు. 75 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారికి ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడం నుంచి కొన్ని మినహాయింపులు లభిస్తాయి.

షరతులు ఇవే..

  • సీనియర్ సిటిజన్ తప్పనిసరిగా 75 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు కలిగి ఉండాలి.
  • మునుపటి సంవత్సరంలో తప్పనిసరిగా రెసిడెంట్ అయి ఉండాలి.
  • అతడికి పెన్షన్, వడ్డీ ఆదాయం మాత్రమే ఉండాలి. తాము పెన్షన్‌ను పొందే బ్యాంకు నుంచే డిపాజిట్లపై వడ్డీ పొందుతూ ఉండాలి.
  • చాప్టర్ VI-A, 87ఏ కింద తగ్గింపులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత సీనియర్ సిటిజన్లకు టీడీఎస్ తీసివేయడానికి ప్రభుత్వం అనుమతి ఇస్తుంది.
  • పైన చెప్పిన విధంగా సీనియర్ సిటిజన్లకు పన్ను మినహాయించిన తర్వాత, వారు ఆదాయపు పన్ను రిటర్న్‌లను అందించాల్సిన అవసరం ఉండదు. అయితే వారికి ఇతర ఆదాయ వనరులు ఉండకూడదు.
  • పన్ను పరిమితి కంటే తక్కువ ఆదాయం ఉన్నప్పటికీ కొన్ని సార్లు ఐటీఆర్ దాఖలు చేయాలి. దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ముఖ్యంగా దేశం వెలుపల ఆస్తులను కలిగి ఉన్నవారికి ఈ నిబంధన వర్తిస్తుంది.
  • లాభదాయకమైన యజమాని, దేశం వెలుపల ఏదైనా ఆస్తి ఉండడం.
  • దేశం వెలుపల ఉన్న ఏదైనా ఖాతాలో సంతకం చేసే అధికారాన్ని కలిగి ఉండడం.
  • దేశం వెలుపల ఉన్న ఏదైనా ఆస్తికి లబ్ధిదారుడు.

మరో నిబంధన..

సెక్షన్ 139(1)లోని ఏడవ నిబంధన ప్రకారం స్థూల ఆదాయంతో సంబంధం లేకుండా ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడం తప్పనిసరి. కింది తెలిపిన విధంగా లావాదేవీలు జరిపితే ఐటీఆర్ తప్పనిసరిగా దాఖలు చేయాలి.

  • బ్యాంకు, సహకార బ్యాంకులలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కరెంట్ ఖాతాలలో రూ. 1 కోటి కంటే ఎక్కువ డిపాజిట్ ఉండడం.
  • విదేశీ దేశానికి ప్రయాణానికి సంబంధించి తనకు, లేదా ఇతరులకు రూ.2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేయడం. విద్యుత్ బిల్లులను రూ. 1 లక్ష కంటే ఎక్కువ చెల్లించడం.
  • మునుపటి సంవత్సరంలో మొత్తం అమ్మకాలు, టర్నోవర్, వ్యాపారం స్థూల రశీదులు రూ. 60 లక్షలకు మించడం. గతేడాది ఒక వృత్తిలో రూ. 10 లక్షలకు మించి సంపాదించడం.
  • ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలలో గతేడాది రూ.50 లక్షలు, అంతకంటే ఎక్కువ డిపాజిట్ కావడం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బంపర్ ఆఫర్ అంటే ఇదీ.. అతి తక్కువ ధరకే 72రోజుల వ్యాలిడిటీ..
బంపర్ ఆఫర్ అంటే ఇదీ.. అతి తక్కువ ధరకే 72రోజుల వ్యాలిడిటీ..
ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..