AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPO: ఐపీఓలో షేర్స్ కొంటున్నారా? లాభాలు కావాలంటే ఈ టిప్స్ పాటించండి..

షేర్ మార్కెట్ లో తరచూ ఐపీవో అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. ఐపీవో అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. వివిధ కంపెనీలు తమ మూలధనం పెంచుకోవడానికి, వ్యాపారాన్ని విస్తరించడం కోసం ఐపీవోకు వస్తాయి. అంటే తన షేర్లను ప్రజలకు విక్రయిస్తాయి. నచ్చిన వారు ఆ షేర్లను కొనడం ద్వారా కంపెనీకి మూలధనం పెరుగుతుంది. అలాగే వ్యక్తులకు ఆ కంపెనీల్లో వాటా ఏర్పడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

IPO: ఐపీఓలో షేర్స్ కొంటున్నారా? లాభాలు కావాలంటే ఈ టిప్స్ పాటించండి..
Ipo
Madhu
|

Updated on: Jul 12, 2024 | 4:58 PM

Share

షేర్ మార్కెట్ పై ప్రజలకు ఆసక్తి పెరుగుతోంది. దానిలో పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. దీనిలో కొంత రిస్క్ ఉన్నప్పటికీ రాబడి కూడా అధికంగా ఉంటుంది. చాలామంది బ్యాంకులు, పోస్టాఫీసులోని రక్షిత పథకాలలో డబ్బులను జమ చేయడంతో పాటు షేర్ మార్కెట్ లోనూ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే దానిపై పూర్తి అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. షేర్ మార్కెట్ లో తరచూ ఐపీవో అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. ఐపీవో అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. వివిధ కంపెనీలు తమ మూలధనం పెంచుకోవడానికి, వ్యాపారాన్ని విస్తరించడం కోసం ఐపీవోకు వస్తాయి. అంటే తన షేర్లను ప్రజలకు విక్రయిస్తాయి. నచ్చిన వారు ఆ షేర్లను కొనడం ద్వారా కంపెనీకి మూలధనం పెరుగుతుంది.

సెబీ నిబంధనలు..

ప్రతి కంపెనీ తనకు అవసరం అయినప్పుడు ఐపీవోకి రావడం సాధ్యం కాదు. దానికి చాలా నిబంధనలు ఉంటాయి. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంచ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) నిబంధనలు ప్రకారం ఐపీవోకి రావాలి. దానికోసం కొన్ని మార్గదర్శకాలను రూపొందించారు.

పరిశీలించాల్సిన అంశాలు..

ఐపీవోకి వచ్చిన కంపెనీ వాటాలు కొనడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు. అయితే కొన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. హడావుడిగా షేర్లను కొనడం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ కింది అంశాలను చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. వాటిల్లో ప్రధానమైనవి ఇవి..

  • కంపెనీ చరిత్ర.. ఐపీవోకు వచ్చిన కంపెనీ చరిత్ర, దాని వ్యాపారం తదితర విషయాలను గమనించాలి. ఆ కంపెనీ ఉత్పత్తులు, సేవలు, మార్కెట్ విలువ తదితర అంశాలు చాలా కీలకం.
  • ఆర్థిక పరిస్థితి.. కంపెనీ ప్రకటించిన ఆదాయం, బ్యాలెన్స్ షీట్, ఇతర ఆర్థిక సంబంధ విషయాలను అధ్యయనం చేయాలి. ఆ కంపెనీ ఆర్థిక నివేదికలను బాగా పరిశీలించాలి.
  • మేనేజ్ మెంట్.. సంస్థకు సంబంధించిన నిర్వహణ బృందం అనుభవం, ట్రాక్ రికార్డ్, విజయాలను పరిశీలించాలి. బోర్డు సభ్యుల నేపథ్యం చాలా అవసరం.
  • విలువ అంచనా.. ఐపీవో వాల్యుయేషన్‌ను అంచనా వేయడం చాలా కీలకం. మితిమీరిన అధిక వాల్యుయేషన్ వేస్తే ప్రారంభ హైప్ తగ్గిన తర్వాత స్టాక్ ధర పడిపోయే అవకాశం ఉంది.
  • రాబడి వినియోగం.. ఐపీవో నుంచి సేకరించిన నిధులను కంపెనీ ఎలా ఉపయోగించాలనుకుంటుందో తెలుసుకోండి. లాభం వచ్చే ప్రాజెక్టులకు ఖర్చు పెడుతుంటే ఇబ్బంది ఉండదు.
  • మార్కెట్ పరిస్థితి.. మార్కెట్ లో పరిస్థితి కూడా ఐపీవోలను బాాగా ప్రభావితం చేస్తుంది. అనుకూలమైన మార్కెట్ ఐపీవోలకు విజయవంతమైన అవకాశాలు కల్పిస్తుంది.
  • విశ్లేషకుల నివేదిక.. ఆర్థిక విశ్లేషకుల నివేదికలు, అభిప్రాయాలను సమీక్షించాలి. దీనివల్ల మార్కెట్ పై అవగాహన కలుగుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..