Lectrix EV: ఆ ఈవీ స్కూటర్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. రూ.50 వేలకే ఆ స్కూటర్ మీ సొంతం

ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తుంది. ఈ నేపథ్యంలో టాప్ కంపెనీల నుంచి స్టార్టప్‌ల వరకు కొత్త మోడల్స్‌ను మార్కెట్‌లోకి లాంచ్ చేస్తున్నాయి. గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహించే దిశగా ఒక ఉత్తేజకరమైన చర్యలో ఎస్ఏఆర్ గ్రూప్‌నకు సంబంధించిన ఈ-మొబిలిటీ విభాగం, లెక్ట్రిక్స్ తమ శక్తివంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్ లెక్ట్రిక్స్ ఎల్ఎక్స్ఎస్ 2.0ని ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

Lectrix EV: ఆ ఈవీ స్కూటర్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. రూ.50 వేలకే ఆ స్కూటర్ మీ సొంతం
Lectrix Ev
Follow us
Srinu

|

Updated on: Jul 12, 2024 | 4:45 PM

ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తుంది. ఈ నేపథ్యంలో టాప్ కంపెనీల నుంచి స్టార్టప్‌ల వరకు కొత్త మోడల్స్‌ను మార్కెట్‌లోకి లాంచ్ చేస్తున్నాయి. గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహించే దిశగా ఒక ఉత్తేజకరమైన చర్యలో ఎస్ఏఆర్ గ్రూప్‌నకు సంబంధించిన ఈ-మొబిలిటీ విభాగం, లెక్ట్రిక్స్ తమ శక్తివంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్ లెక్ట్రిక్స్ ఎల్ఎక్స్ఎస్ 2.0ని ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ దాని పనితీరు, సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు ప్రత్యేక తగ్గింపు ఆఫర్‌తో ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో లెక్ట్రిక్స్ ఈవీ స్కూటర్‌పై తాజా ఆఫర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం

లెక్ట్రిక్స్ ఎల్ఎక్స్ఎస్ 2.0పై రూ. 5,000 పరిమిత-సమయ తగ్గింపును ప్రకటించింది. బ్యాటరీ లేని వెర్షన్ కోసం దాని ధరను రూ. 49,999కి తగ్గించింది. సాధారణంగా ఈ స్కూటర్ ప్రామాణిక ధర రూ.75999. అయితే అయితే కస్టమర్‌లు బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ను ఎంచుకుంటే తగ్గింపు ధర వర్తిస్తుంది. అంటే బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ని ఎంచుకునే వారికి, ఎలక్ట్రిక్ స్కూటర్ రూ.49,999కి అందుబాటులో ఉంది. బ్యాటరీకి అదనంగా నెలవారీ సబ్‌స్క్రిప్షన్ రుసుము ₹999 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మోడల్ బ్యాటరీపై జీవితకాల వారెంటీ ఉంటుంది. 

లెక్ట్రిక్స్ ఎల్ఎక్స్ఎస్ 2.0పై లెక్ట్రిక్స్ 3 సంవత్సరాలు లేదా 30,000 కిమీల సమగ్ర వారంటీని అందిస్తుంది. 50 కిమీల రోజువారీ వినియోగంతో ఈ వారంటీ దాదాపు 20 నెలల పాటు చెల్లుబాటు అవుతుంది. అధిక వినియోగం కోసం సర్దుబాట్లు చేయబడతాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేసిన 2-3 వారాల్లో డెలివరీ చేస్తామని కంపెనీ హామీ ఇస్తుంది. ముఖ్యంగా ఈ స్కూటర్‌ను ఫుల్ ఛార్జింగ్‌తో 100 కిమీ మైలేజ్ ఇస్తుంది. అలాగే 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ స్కూటర్ కేవలం 9 సెకన్లలో 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ స్కూటర్ 6 ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..