Recharge plan: నెలకు రూ. 200 కంటే తక్కువ.. 395 రోజుల వ్యాలిడిటీతో రీఛార్జ్‌ ప్లాన్‌

ఇప్పటికే పలు ఆకర్షణీయమైన రీఛార్జ్‌ ప్లాన్స్‌ను పరిచయం చేసిన బీఎస్‌ఎన్‌ఎల్ తాజాగా మరో బెస్ట్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ను పరిచయం చేసింది. త్వరలోనే దేశవ్యాప్తంగా 4జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్న తరుణంలో యూజర్లను అట్రాక్ట్‌ చేసే పనిలో పడింది బీఎస్‌ఎన్‌ఎల్. ఇందులో భాగంగానే తాజాగా 13 నెలల వ్యాలిడిటీతో కూడిన ప్లాన్‌ను పరిచయం చేసింది...

Recharge plan: నెలకు రూ. 200 కంటే తక్కువ.. 395 రోజుల వ్యాలిడిటీతో రీఛార్జ్‌ ప్లాన్‌
Recharge Plan
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 12, 2024 | 2:50 PM

ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రధాన ప్రైవేట్‌ టెలికం సంస్థలు భారీగా టారిఫ్‌లను పెంచిన విషయం తెలిసిందే. జియోతో మొదలైన ధరల పెంపును ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ఐడియా కూడా కొనసాగించాయి. ఈ కంపెనీలన్నీ సుమారు 15 నుంచి 25 శాతం ఛార్జీలను పెంచేశాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్‌ యూజర్లను ఆకర్షించే క్రమంలో సరికొత్త ప్లాన్స్‌ను తీసుకొస్తోంది.

ఇప్పటికే పలు ఆకర్షణీయమైన రీఛార్జ్‌ ప్లాన్స్‌ను పరిచయం చేసిన బీఎస్‌ఎన్‌ఎల్ తాజాగా మరో బెస్ట్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ను పరిచయం చేసింది. త్వరలోనే దేశవ్యాప్తంగా 4జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్న తరుణంలో యూజర్లను అట్రాక్ట్‌ చేసే పనిలో పడింది బీఎస్‌ఎన్‌ఎల్. ఇందులో భాగంగానే తాజాగా 13 నెలల వ్యాలిడిటీతో కూడిన ప్లాన్‌ను పరిచయం చేసింది. 395 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్‌ రానుంది.

ఈ ప్లాన్‌ ధర రూ. 2,399గా నిర్ణయించారు, ఈ లెక్కన నెలకు రూ. 200 కంటే తక్కువే అన్నమాట. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. అలాగే రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు పొందొచ్చు. వీటితో పాటు దేశంలోని అన్ని నెట్‌వర్క్స్‌కి అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌ పొందొచ్చు. వీటితో పాటు జింగ్ మ్యూజిక్, బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, హార్డీ గేమ్స్, ఛాలెంజర్ అరేనా గేమ్స్, గేమన్ ఆస్ట్రోటెల్ వంటి సేవలను కూడా ఉచితం యాక్సెస్ చేసుకోవచ్చు.

ఇదిలా ఉంటే బీఎస్‌ఎన్‌ఎల్‌ 365 రోజుల వ్యాలిడిటీతో మరో సూపర్ ప్లాన్‌ను అందిస్తోంది. ఇందులో భాగంగా రూ. 1999తో రీఛార్జ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో అన్‌లిమిటెడ్ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు 600 జీబీ డేటా పొందొచ్చు. వీటితో పాటు అదనంగా జింగ్ మ్యూజిక్, బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, హార్డీ గేమ్స్, ఛాలెంజర్ ఎరీనా గేమ్స్, గేమన్ ఆస్ట్రోటెల్ వంటి ప్రయోజనాలు పొందొచ్చు. ఈ లెక్కన రోజుకు రూ .5.47 చెల్లిస్తారన్నమాట. మరి ప్రైవేట్ కంపెనీల పోటీ కారణంగా వెనకబడ్డ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ సరికొత్త ప్లాన్స్‌తో ఏమేర యూజర్లను అట్రాక్ట్ చేస్తుందో చూడాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..