IPL: ఎక్కడైనా, ఎప్పుడైనా ఐపీఎల్.. జియో స్పెషల్ రీఛార్జ్ ప్యాక్‌లు
ప్రయాణంలో ఉన్న సమయంలో లేదా వైఫై అందుబాటులో లేని సమయంలో ఉపయోగపడేలా ఈ ప్లాన్స్‌ను జియో తీసుకొచ్చింది. ఇంతకీ జియో అందిస్తున్న ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ఏంటి.? వాటి పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కువ డేటా లభించేలా ఈ ప్లాన్స్‌ను తీసుకొచ్చారు...
ఐపీఎల్ కొత్త సీజన్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2024 సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానుంది. మార్చి 22వ తేదీ నుంచి ఐపీఎల్ ప్రారంభంకానుండడంతో అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఐపీఎల్ మ్యాచ్‌లో జియో సినిమా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూజర్ల కోసం జియో ప్రత్యేక ప్యాక్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రయాణంలో ఉన్న సమయంలో లేదా వైఫై అందుబాటులో లేని సమయంలో ఉపయోగపడేలా ఈ ప్లాన్స్‌ను జియో తీసుకొచ్చింది. ఇంతకీ జియో అందిస్తున్న ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ఏంటి.? వాటి పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కువ డేటా లభించేలా ఈ ప్లాన్స్‌ను తీసుకొచ్చారు. రూ.667, రూ.444తో యూజర్లకు ఈ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రూ. 667 తో రీఛార్జ్ చేసుకుంటే 90 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అయితే ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే కేవలం డేటా వోచర్‌లాగా మాత్రమే పనిచేస్తుంది. దీంట్లో వాయిస్ కాలింగ్, ఎసెమ్మెస్ వంటి ప్రయోజనాలేమీ ఉండవు. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవాలంటే కచ్చితంగా ఏదో ఒక బేస్ ప్లాన్ ఉండాల్సిందే. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే మొత్తం 150 జీబీ డేటా లభిస్తుంది. రోజువారీ పరిమితి లేకుండా డేటాను ఉపయోగించుకోవచ్చు.
ఇక ఊ. 444తో రీఛార్జ్ చేసుకుంటే 100 జీబీ డేటా లభిస్తుంది. దీనికి 60 రోజుల వ్యాలిడిటీని అందించారు. ఈ ప్లాన్‌కు కూడా ఏదో ఒక బేస్ ప్లాన్ ఉండాల్సిందే. ఇదిలా ఉంటే జియో సినిమా యాప్‌లో ఐపీఎల్ వీక్షించవచ్చు. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ లేని వారు కూడా ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించే అవకాశం కల్పించారు. ఇక జియో యూజర్లు మాత్రమే కాకుండా ఇతర టెలికం యూజర్లు సైతం జియో సినిమా యాప్‌లో మ్యాచ్‌లను వీక్షించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..