Recharge: మొబైల్‌ యూజర్లకు షాకింగ్ న్యూస్‌.. భారీగా పెరిగిన ఛార్జీలు..

ప్రముఖ టెలికం సంస్థ జియో తమ యూజర్లకు షాకింగ్ న్యూస్‌ చెప్పింది. రీఛార్జ్‌ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఈ ధరలు జులై 3వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. జియో ప్లాన్స్‌పై ఏకంగా రూ.40కిపైగా పెరగడం గమనార్హం. నెల, రెండు, మూలు నెలలు, ఏడాది ప్లాన్స్‌పై ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ జియో పెంచిన రీఛార్జ్‌ ధరలకు సంబంధించిన పూర్తి వివరాలు...

Recharge: మొబైల్‌ యూజర్లకు షాకింగ్ న్యూస్‌.. భారీగా పెరిగిన ఛార్జీలు..
Recharge plans
Follow us

|

Updated on: Jun 27, 2024 | 7:49 PM

ప్రముఖ టెలికం సంస్థ జియో తమ యూజర్లకు షాకింగ్ న్యూస్‌ చెప్పింది. రీఛార్జ్‌ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఈ ధరలు జులై 3వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. జియో ప్లాన్స్‌పై ఏకంగా రూ.40కిపైగా పెరగడం గమనార్హం. నెల, రెండు, మూలు నెలలు, ఏడాది ప్లాన్స్‌పై ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ జియో పెంచిన రీఛార్జ్‌ ధరలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

* ప్రస్తుతం అందుబాటులో ఉన్న రూ. 155 రీఛార్జ్‌ ప్లాన్‌ను రూ. 189కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది.

* రూ. 209 రీఛార్జ్‌ ప్లాన్‌ను రూ. 249కి పెంచారు. 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌లో రోజుకు 1జీబీ డేటా లభించనుంది.

* రూ. 239 రీఛార్జ్‌ ప్లాన్‌ను రూ. 299కి పెంచారు. 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ప్లాన్‌తో రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది.

* రూ. 299 రీఛార్జ్‌ ప్లాన్‌ను రూ.349కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌లో రోజుకు 2.5 జీబీ డేటా లభిస్తుంది.

* రూ. 399 రీఛార్జ్‌ ప్లాన్‌ను రూ. 449కి పెంచారు. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే రోజుకు 3 జీబీ డేటా లభిస్తుంది.

* ఇక రూ. 479 ప్లాన్‌ను రూ. 579కి పెంచారు. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 56 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5జీబీ డేటా లభిస్తుంది.

* రూ. 533 ప్లాన్‌ను రూ. 629కి పెంచారు. ఈ ప్లానతో రీఛార్జ్‌ చేసుకుంటే 56రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది.

* రూ. 395 ప్లాన్‌ను రూ. 479కి పెంచారు. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 84 రోజుల వ్యాలిడిటీతో 6 జీబీ డేటా లభిస్తుంది.

* రూ.666 ప్లాన్‌ను రూ. 799కి పెంచారు. 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది.

* రూ. 719 ప్లాన్‌ను రూ. 859కి పెంచారు. ఇందులో 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది.

* రూ. 999 ప్లాన్‌ను రూ. 1199కి పెంచారు. ఈ ప్లాన్‌ను రోజుకు 3 జీబీ డేటా లభిస్తుంది.

డేటా యాడ్‌ ఆన్‌ ఛార్జీలు సైతం..

* రూ.15గా ఉన్న రీఛార్జ్‌ ప్లాన్‌ను రూ. 19కి పెంచారు. దీంతో 1జీబీ డేటా లభిస్తుంది.

* రూ. 25గా ఉన్న ప్లాన్‌ను రూ. 29కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్లాన్‌లో 2 జీబీ డేటా లభిస్తోంది.

* రూ. 61గా ఉన్న ప్లాన్‌ను రూ. 69కి పెంచారు. దీంతో 6 జీబీ డేటా లభిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..