ఈ కుక్కపిల్ల పోస్టుకు రూ.20 లక్షలు సంపాదిస్తోంది..!
పరిస్థితులు బాగోబోతే.. చాలా మంది ఏంటో.. ఛీ నా బతుకు.. కుక్కకన్నా దారుణమైంది అని అనుకుంటూంటారు. కానీ.. కుక్క కూడా ఆదాయం సంపాదిస్తుందని తెలిస్తే.. ఇక దేంతో పోల్చుకుంటారో.. కదా..! వినడానికి సరదాగా ఉన్న ఇది నిజం. ఒక కుక్కపిల్ల సోషల్ మీడియా ద్వారా ఏకంగా రూ.20 లక్షలు సంపాదిస్తోంది. ఏంటి..? ఇంత డబ్బే అనుకుంటున్నారా..? అదే మరి సోషల్‌మీడియా మహత్యమంటే..? ఎప్పుడు ఎవరి లైఫ్ ఎలా మారుతుందో.. అస్సలు అర్థంకాదు. జిఫ్‌పామ్ అనే కుక్కపిల్ల.. టెడ్డీ […]
పరిస్థితులు బాగోబోతే.. చాలా మంది ఏంటో.. ఛీ నా బతుకు.. కుక్కకన్నా దారుణమైంది అని అనుకుంటూంటారు. కానీ.. కుక్క కూడా ఆదాయం సంపాదిస్తుందని తెలిస్తే.. ఇక దేంతో పోల్చుకుంటారో.. కదా..! వినడానికి సరదాగా ఉన్న ఇది నిజం. ఒక కుక్కపిల్ల సోషల్ మీడియా ద్వారా ఏకంగా రూ.20 లక్షలు సంపాదిస్తోంది. ఏంటి..? ఇంత డబ్బే అనుకుంటున్నారా..? అదే మరి సోషల్‌మీడియా మహత్యమంటే..? ఎప్పుడు ఎవరి లైఫ్ ఎలా మారుతుందో.. అస్సలు అర్థంకాదు.
జిఫ్‌పామ్ అనే కుక్కపిల్ల.. టెడ్డీ బేర్‌లా భలే ముద్దుగా ఉంటుంది. కొన్నేళ్ల కిందట ఇది ‘క్యాటీ పెర్రీ’ మ్యూజిక్ వీడియోలో కనిపించింది. దీంతో.. చాలామంది ఆ కుక్కపిల్లకు ఫ్యాన్స్ అయిపోయారు. ఈ సందర్భంలో.. ఆ కుక్కపిల్ల యజమాని దాని పేరుతో వివిధ సోషల్‌మీడియా ఫ్లాట్‌పామ్‌లలో పేజీ ప్రారంభించారు.
కాగా.. 2019లో జిఫ్‌పామ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 3.6 మిలియన్ మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ ఏడాది ఆ సంఖ్య 9.2 మిలియన్లకు పెరిగింది. దీంతో.. జిప్‌పామ్ ఆదాయం కూడా పెరిగింది. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లు కలిగిన వ్యక్తులకు ఆయా సంస్థలు నగదు చెల్లిస్తాయనే సంగతి తెలిసిందే. సెలబ్రెటీలు సోషల్ మీడియాను అడ్డాగా చేసుకుని ఫుల్‌గా పైసా వసూల్ చేస్తున్నారు. ఇప్పుడు వారు మాత్రమే కాకుండా ఇలా కుక్కలు, తదితర జంతువులు కూడా డబ్బులు సంపాదించేస్తున్నాయ్.
https://www.instagram.com/p/B0EbRl1Fe2J/