ఫౌండర్ మిస్సింగ్.. 20శాతం తగ్గిన ‘కాఫీ డే’ షేర్లు

కాఫీ డే వ్యవస్థాపకుడు వి.జి. సిద్ధార్థ అదృశ్యంతో ఆ కంపెనీ షేర్లు 20శాతం తగ్గిపోయాయి. దీంతో లోయర్ సర్క్యూట్ మార్కు అయిన 154.05కు తాకింది. మరోవైపు ఆయన అదృశ్యంతో మదుపర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే సోమవారం సాయంత్రం మంగళూరులోని నేత్రావతి నది వంతెనపై నడుచుకుంటూ వెళ్లిన సిద్ధార్థ ఆ తరువాత అదృశ్యమయ్యారు. ఈ ఘటనకు ముందు కంపెనీ డైరక్టర్లకు, ఉద్యోగులకు లేఖ రాయడంతో ఆయన ఆత్మహత్య చేసుకొని ఉంటాడని భావిస్తున్నారు. కాగా మరోవైపు సిద్ధార్థ అదృశ్యం […]

ఫౌండర్ మిస్సింగ్.. 20శాతం తగ్గిన ‘కాఫీ డే’ షేర్లు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 30, 2019 | 12:24 PM

కాఫీ డే వ్యవస్థాపకుడు వి.జి. సిద్ధార్థ అదృశ్యంతో ఆ కంపెనీ షేర్లు 20శాతం తగ్గిపోయాయి. దీంతో లోయర్ సర్క్యూట్ మార్కు అయిన 154.05కు తాకింది. మరోవైపు ఆయన అదృశ్యంతో మదుపర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే సోమవారం సాయంత్రం మంగళూరులోని నేత్రావతి నది వంతెనపై నడుచుకుంటూ వెళ్లిన సిద్ధార్థ ఆ తరువాత అదృశ్యమయ్యారు. ఈ ఘటనకు ముందు కంపెనీ డైరక్టర్లకు, ఉద్యోగులకు లేఖ రాయడంతో ఆయన ఆత్మహత్య చేసుకొని ఉంటాడని భావిస్తున్నారు. కాగా మరోవైపు సిద్ధార్థ అదృశ్యం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు పోలీసులు.