ఎకరా భూమి రూ.745కోట్లు.. దేశంలోనే రికార్డు

ఇండియాలో రియల్ ఎస్టేట్ రంగంలో అత్యంత విలువైన ఒప్పందం జరిగింది. ముంబైలో ఓ ఎకరం ధర రూ.745కోట్లు పలికింది. ఖరీదైన ప్రాంతంగా పిలిచే బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో మూడు ఎకరాలకు భారీ డిమాండ్ లభించింది. దీని కోసం రూ.2,238 కోట్లకు కొనుగోలు చేసేందుకు జపాన్ సంస్థ సుమితోమో బిడ్ దాఖలు చేసింది. కాగా ఎకరా ధర విషయంలో దేశంలోనే ఇది రికార్డు కావడం విశేషం. విక్రయానికి పెట్టిన ఈ భూమి రిలయెన్స్ జియో గార్డెన్స్‌కు పక్కనే ఉందని.. […]

ఎకరా భూమి రూ.745కోట్లు.. దేశంలోనే రికార్డు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 26, 2019 | 11:15 AM

ఇండియాలో రియల్ ఎస్టేట్ రంగంలో అత్యంత విలువైన ఒప్పందం జరిగింది. ముంబైలో ఓ ఎకరం ధర రూ.745కోట్లు పలికింది. ఖరీదైన ప్రాంతంగా పిలిచే బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో మూడు ఎకరాలకు భారీ డిమాండ్ లభించింది. దీని కోసం రూ.2,238 కోట్లకు కొనుగోలు చేసేందుకు జపాన్ సంస్థ సుమితోమో బిడ్ దాఖలు చేసింది. కాగా ఎకరా ధర విషయంలో దేశంలోనే ఇది రికార్డు కావడం విశేషం. విక్రయానికి పెట్టిన ఈ భూమి రిలయెన్స్ జియో గార్డెన్స్‌కు పక్కనే ఉందని.. అందుకే అంత పెద్ద మొత్తం చెల్లించేందుకు జపాన్ సంస్థ పూనుకుందని ముంబై మహానగర ప్రాంతీయ అభివృద్ధి ప్రాధికార సంస్థ పేర్కొంది.