రూ.35వేలకు పసిడి ధర..! ఇంకా పైపైకి..?

అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర ఆరేళ్ల గరిష్టానికి చేరుకుంది. ప్రస్తుతం మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.34,588లుగా పలుకుతోంది. కొద్దిరోజులుగా పెరుగుతూ.. తగ్గుతూ వస్తోన్న పసిడి.. బుధవారం ఒక్కసారిగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.34,588లకు చేరగా, 22 క్యారెట్ల బంగారు ఆభరణాల ధర రూ.34,000లుగా ఉంది. దీంతో.. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు డీలా పడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు పెరగడం, దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ ప్రారంభంకావడం వంటి పరిణామాలతో కొనుగోళ్లు జోరుగా ఊపందుకున్నప్పటికీ […]

రూ.35వేలకు పసిడి ధర..! ఇంకా పైపైకి..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu

Updated on: Jun 26, 2019 | 5:32 PM

అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర ఆరేళ్ల గరిష్టానికి చేరుకుంది. ప్రస్తుతం మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.34,588లుగా పలుకుతోంది. కొద్దిరోజులుగా పెరుగుతూ.. తగ్గుతూ వస్తోన్న పసిడి.. బుధవారం ఒక్కసారిగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.34,588లకు చేరగా, 22 క్యారెట్ల బంగారు ఆభరణాల ధర రూ.34,000లుగా ఉంది. దీంతో.. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు డీలా పడుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు పెరగడం, దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ ప్రారంభంకావడం వంటి పరిణామాలతో కొనుగోళ్లు జోరుగా ఊపందుకున్నప్పటికీ పెరిగిన ధరలతో కొనుగోలుకు కొంత ఆలోచించాల్సి వస్తోందని అంటున్నారు. అందులోనూ వచ్చేది ఆషాడ మాసం.. ఈ మాసంలో ధరలు తగ్గుతాయని అందరూ భావిస్తున్నా.. ప్రస్తుత మార్కెట్ రేట్ ప్రకారం ఆ అంచనాలు తారుమారు అవుతాయనే అనుకోవాలి. కాగా.. రానున్న కాలంలో పసిడి ధరలు ఇంకా పెరగవచ్చునని ట్రేడ్ ఎనలిస్టులు భావిస్తున్నారు. అటు వెండి కూడా కిలో రూ.40,355కు చేరుకుంది.