ITR Filing: ఫారం-16 లేకుండా ఐటీఆర్ ఫైల్ చేయలేమా? దానికంత ప్రాధాన్యం ఎందుకు?

ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఇన్ కం ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు అనేక పత్రాలు అవసరమవుతాయి. ఐటీఆర్ ను సక్రమంగా ఫైల్ చేయడానికి, ఒక వేళ పన్ను ఎక్కువగా చెల్లిస్తే రీఫండ్ పొందడానికి కూడా కీలకంగా మారతాయి. అలాంటి ముఖ్యమైన పత్రాలలో ఫారం 16 కూడా ఒకటి. పన్ను లెక్కింపులో ఇది చాలా ఉపయోగపడుతుంది. అయితే ఫారం 16 లేకపోయినా ఐటీఆర్ ఫైల్ చేయవచ్చా అనే సందేహం చాలా మందికి వస్తుంది.

ITR Filing: ఫారం-16 లేకుండా ఐటీఆర్ ఫైల్ చేయలేమా? దానికంత ప్రాధాన్యం ఎందుకు?
Income Tax
Follow us

|

Updated on: Jul 11, 2024 | 4:18 PM

ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఇన్ కం ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు అనేక పత్రాలు అవసరమవుతాయి. ఐటీఆర్ ను సక్రమంగా ఫైల్ చేయడానికి, ఒక వేళ పన్ను ఎక్కువగా చెల్లిస్తే రీఫండ్ పొందడానికి కూడా కీలకంగా మారతాయి. అలాంటి ముఖ్యమైన పత్రాలలో ఫారం 16 కూడా ఒకటి. పన్ను లెక్కింపులో ఇది చాలా ఉపయోగపడుతుంది. అయితే ఫారం 16 లేకపోయినా ఐటీఆర్ ఫైల్ చేయవచ్చా అనే సందేహం చాలా మందికి వస్తుంది. అది సాధ్యమే అయినప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

ఫారం 16 అంటే..

ఫారం 16ను ట్యాక్స్ సర్టిఫికెట్ లేదా టీడీఎస్ సర్టిఫికెట్ అని కూడా పిలుస్తారు. ఒక కంపెనీ తన ఉద్యోగులకు దీనిని అందజేస్తుంది. ఈ ఫారంలో వేతనం, మినహాయింపులు, తగ్గింపులు, ఆర్థిక సంవత్సరంలో చేసిన టీడీస్ మినహాయింపులు తదితర సమాచారం ఉంటుంది. ఐటీఆర్ సమర్పించేటప్పుడు ఇది కీలకంగా మారుతుంది.

సాధ్యమే..

ఫారం 16 లేకుండా ఐటీఆర్ సమర్పించడం కష్టమే అయినప్పటికీ అసాధ్యం కాదు. అయితే సరైన ప్రణాళికతో ఆ పనిచేయాలి. అందుకోసం అనుసరించాల్సిన పద్ధతులను తెలుసుకుందాం.

ముందుగా జీతం రశీదులు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, పెట్టుబడి రుజువులు తదితర అవసరమైన పత్రాలను జాగ్రత్త చేసుకోవాలి. ఫారం 26 ఏఎస్ ను ఉపయోగించి టీడీఎస్ ను లెక్కించాలి. అలాగే పన్ను మినహాయింపులను తనిఖీ చేసి, మీ పన్ను బాధ్యతను లెక్కించాలి. అలాగే ఆధార్ ఓటీపీ, ధృవీకరించబడిన బ్యాంక్ ఖాతా ద్వారా మీ ఐటీఆర్ ను ఇ-ధృవీకరించుకోవాలి. ఎందుకంటే మీరు ఐటీఆర్ సమర్పించినా.. ఇ-ధృవీకరణ కాకపోతే ప్రాసెసింగ్ అవ్వదు. కాబట్టి తప్పనిసరిగా ఆ విషయాన్ని నిర్ధారించుకోవాలి.

అవసరమైన పత్రాలు..

మీవద్ద ఫారం 16 లేకపోతే అవసరమైన మిగిలిన పత్రాలను సేకరించడం తప్పనిసరి. వీటిలో జీతం రశీదులు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, పెట్టుబడి రుజువులు, అద్దె రశీదులు ఉంటాయి. ఇవి మీ ఆదాయం, పెట్టుబడులు తదితర విషయాలను తెలియజేస్తాయి.

టీడీఎస్ లెక్కింపు..

మీ జీతంలో మినహాయించిన టీడీఎస్ ను లెక్కంచడం కోసం ఫారం 26 ఏఎస్ చాలా అవసరం. దానిలో మీ జీతం నుంచి తీసివేయబడిన టీడీఎస్ వివరాలు ఉంటాయి. మీ జీతం స్లిప్‌లో చూపిన టీడీఎస్.. అలాగే ఫారం 26 ఏఎస్ లోని సమాచారంతో సరిపోవాలి. దానికి ముందుగా నిర్దారణ చేసుకోవాలి.

తగ్గింపుల పరిశీలన..

ఆదాయపు పన్ను చట్టం కింద కొన్ని ఆదాయాలకు మినహాయింపులు లభిస్తాయి. ముఖ్యంగా ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్ ఆర్ఏ), మెడికల్ అలవెన్స్, సెక్షన్ 80సీ కింద పెట్టిన పెట్టుబడులకు తగ్గింపు అవకాశం ఉంది. మీ ఆదాయం నుంచి వాటిని తీసివేయాలి. అలాగే ప్రతి జీతం పొందే వ్యక్తి రూ.50 వేల స్టాండర్డ్ డిడక్షన్‌కు అర్హుడు. మీరు పన్ను చెల్లించే ఆదాయాన్ని నిర్ణయించడానికి ముందుగా మీ జీతం నుంచి ఈ మొత్తాన్ని తగ్గించాలి.

పన్ను గణన..

మీకు వచ్చిన ఆదాయంలో తగ్గింపులు, మినహాయింపులు తీసివేసిన తర్వాత పన్ను పరిధిలోకి వచ్చే మీ ఆదాయం నిర్ధారణ అవుతుంది. దాని ఆధారంగా మీరు ఎంత పన్ను కట్టాలో తెలుస్తుంది. మీరు అదనపు పన్ను చెల్లించాలా లేదా మీకు రీఫండ్‌ వస్తుందా అనే విషయం తెలుస్తుంది.

ఇ-వెరిఫై తప్పనిసరి..

చాలా మంది ఐటీఆర్ సమర్పించిన తర్వాత ఇ-వెరిఫై చేయడం మర్చిపోతారు. దానివల్ల రీఫండ్‌ ఆలస్యమవుతుంది. ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత ఆరు వేర్వేరు పద్ధతులలో ఇ-వెరిఫై చేసుకోవచ్చు. ఆధార్, బ్యాంక్ ఖాతా, డీమ్యాట్ ఖాతా, ఏటీఎం, నెట్ బ్యాంకింగ్, డిజిటల్ సంతకం సర్టిఫికెట్ ను ఉపయోగించి తెలుసుకోవచ్చు. ఇ-వెరిఫై అంటే ఇ-ధ్రువీకరణ. ఇది పూర్తయిన తర్వాతే మీ ఐటీఆర్ ప్రాసెస్ అవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..