Vivad se Vishwas Scheme: వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్.. మరో మూడు రోజులే చాన్స్..!
ఆదాయపు పన్ను శాఖతో పెండింగ్‌లో ఉన్న వివాదాలను పరిష్కరించుకోవడంలో పన్ను చెల్లింపుదారులకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2024లో ‘వివాద్ సే విశ్వాస్’ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం ద్వారా పన్ను చెల్లింపుదారులు తమ వివాదాలను పరిష్కరించడానికి తదుపరి జరిమానాలను నివారించడానికి నిర్దిష్ట శాతంతో పాటు వారి వివాదాస్పద పన్ను మొత్తాన్ని చెల్లించవచ్చు.
2024 సంవత్సరం ముగుస్తున్నందున ‘వివాద్ సే విశ్వాస్’ డిసెంబర్ 31, 2024 లోపు దరఖాస్తు ఫారమ్‌తో పాటు చెల్లింపును పూర్తి చేసే వారికి తక్కువ ఖర్చుతో వారి బకాయిలు క్లియర్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ స్కీమ్ ప్రారంభంలోనే పన్ను వివాదాలను పరిష్కరించే తేదీ డిసెంబర్ 31, 2024కి పరిమితం చేశారు. అయితే జనవరి 1, 2025 తర్వాత ఈ స్కీమ్ ద్వారా దరఖాస్తు చేసినా ఎలాంటి ఉపయోగం ఉండదని నిపుణులు చెబుతున్నారు. డిసెంబరు 31లోపు డిక్లరేషన్‌ను దాఖలు చేసే పన్ను చెల్లింపుదారులు వివాదాస్పద పన్ను డిమాండ్‌లో 100 శాతం చెల్లించాలి. తర్వాత వారి వడ్డీ, జరిమానాలు మాఫీ అవుతాయి. జనవరి 1, 2024న లేదా ఆ తర్వాత చేసిన ప్రకటనలు వివాదాస్పద పన్ను డిమాండ్‌లో 110 శాతం ఉండాలి.
వార్షిక బడ్జెట్ 2024-25 సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలైలో వివాద్ సే విశ్వాస్ స్కీమ్ 2024ని ఆవిష్కరించారు. పన్ను చెల్లింపుదారులకు తమ ఆదాయపు పన్ను సమస్యలను పరిష్కరించడానికి ఈ స్కీమ్ రూపొందించారు. తరువాత వివాదం సే విశ్వాస్ 2.0 అక్టోబర్ 1, 2024 నుండి అమలులోకి వచ్చింది. జూలై 22, 2024 నాటికి పెండింగ్‌లో ఉన్న అప్పీల్, రాతపూర్వక పిటిషన్ లేదా స్పెషల్ లీవ్ పిటిషన్ ఉన్న ఎవరైనా ఈ స్కీమ్‌కు అర్హులు. అలాగే జూలై 22, 2024లోపు వివాద పరిష్కార ప్యానెల్ ముందు అభ్యంతరాలు దాఖలు చేసి ఇంకా నిర్ణయం కోసం వేచి ఉన్న వ్యక్తులు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందవచ్చు. డీఆర్‌పీ ఆదేశాలు జారీ చేసిన సందర్భాల్లో జూలై 22, 2024 నాటికి అసెస్‌మెంట్ అసంపూర్తిగా ఉంటుంది. అలాగే సెక్షన్ 264 కింద రివిజన్ దరఖాస్తుదారులు కూడా ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందచ్చు.
వివాద్ సే విశ్వాస్ స్కీమ్ కోసం ఈ ఫామ్స్ తప్పనిసరి
ఈ పథకంకింద అప్లయ్ చేయడానికి కొన్న్ని ఫారమ్స్ తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. డిక్లరేషన్, అండర్‌టేకింగ్ ఫారమ్, అనంతరం నియమించి అథారిటీ ద్వారా సర్టిఫికేట్, చెల్లింపు ఫారమ్‌నకు సంబంధించిన సమాచారం, పన్ను బకాయిల పూర్తి, చివరి సెటిల్మెంట్ కోసం ఆర్డర్ కూడా అవసరం అవుతుంది. ఈ పథకం బలహీనమైన కేసులను పరిష్కరించడంతో పాటు పన్ను చెల్లింపుదారులకు వ్యాజ్యం ఖర్చులను ఆదా చేయడానికి రూపొందించారు. ముఖ్యంగా ఈ పథకం ద్వారా మూలధన లాభాలు, అసురక్షిత రుణాలు లేదా వారంటీ క్లెయిమ్‌ల వంటి సమస్యలకు సంబంధించిన కొన్ని చిన్న వివాదాలు సమర్ధవంతంగా పరిష్కరిస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి