AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honda unicorn: కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్ .. అప్‌డేట్ మోడల్‌ను విడుదల చేసిన కంపెనీ

మన దేశంలో ద్విచక్ర వాహనాల వినియోగంగా బాగా ఎక్కువ. నిత్యం అనేక కంపెనీలకు చెందిన వాహనాలు మార్కెట్ లోకి విడుదలవుతూ ఉంటాయి. వాటిలో కొన్నింటికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఆ వాహనాలను కొనుగోలు చేయడానికి ప్రజలు ఎంతో ఆసక్తి చూపుతారు. వాటిలో హోండా యూనికార్న్ ముందు వరుసలో ఉంటుంది. ఈ బండికి యవతలో పాటు పెద్దలలో కూడా మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా హోండా 2025 యూనికార్న్ బైక్ మార్కెట్ లోకి విడుదలైంది. ఆధునిక ఫీచర్లు, ఓపీడీ2బీ ప్రమాణాలకు అనుగుణంగా దీన్ని అప్ డేట్ చేశారు.

Honda unicorn: కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్ .. అప్‌డేట్ మోడల్‌ను విడుదల చేసిన కంపెనీ
Honda Unicorn 2025
Nikhil
|

Updated on: Dec 28, 2024 | 5:00 PM

Share

హోండా మోటారు సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) విడుదల చేసిన కొత్త యూనికార్న్ ను ఆధునిక రైడర్ల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దారు. లేటెస్టు ఫీచర్లు, ఓబీడీ2బీ ప్రమాణాలతో రూపొందించారు. ఈ బైక్ రూ.1,19,481 (ఎక్స్ షోరూమ్) ధరకు అందుబాటులో ఉంది. ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్, సీఈవో ఇసుత్సుము మాట్లాడుతూ భారత్ లోని ప్రీమియం కమ్యూటర్ సెగ్మెంట్ లో హోండా యూనికార్న్ అగ్రగామిగా ఉందన్నారు. లక్షల మంది వాహన దారుల అభిమానం పొందిందన్నారు. కొత్త యూనికార్న్ తో నాణ్యత, సౌకర్యం, విశ్వసనీయత మరింత పెరుగుతుందన్నారు.

క్రోమ్ యాక్సెంట్ లతో కూడిన కొత్త ఎల్ఈడీ హెడ్ ల్యాంపులతో, అప్ డేట్ చేసిన కొత్త డిజైన్ తో యూనికార్న్ అందుబాటులోకి వచ్చింది. మిగిలిన లుక్ పరంగా గత మోడల్ మాదిరిగానే కనిపిస్తుంది. అయితే పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, మాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, రెడియంట్ మెటాలిక్ అనే మూడు రంగుల్లో లభిస్తుంది. పెర్ల్ సైరన్ బ్ల్యూ కలర్ నిలిపివేశారు. యూనికార్న్ లోని పూర్తి డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ లో గేర్ పొజిషన్, ఎకో ఇండికేటర్, సర్వీస్ డ్యూ ఇండికేటర్ సమాచారం చూసుకోవచ్చు. యూఎస్బీ టైప్ సీ చార్జింగ్ పోర్టు కూడా ఏర్పాటు చేశారు. ఓబీడీ2బీ నిబంధనలను అనుగుణంగా యూనికార్న్ ను అప్ డేట్ చేశారు. 162.71 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ నుంచి 13 బీహెచ్ పీ, 14.58 ఎన్ ఎం టార్కు విడుదల అవుతుంది. ఇంజిన్ కు ఐదు స్పీడ్ గేర్ బాక్స్ జత చేశారు.

ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ అయిన హోండాకు మన దేశంలో ఆదరణ ఎక్కువగా ఉంటుంది. ఈ కంపెనీ విడుదల చేసిన వాహనాల నాణ్యత, మన్నిక, సామర్థ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ నేపథ్యంలో కంపెనీ తన వాహనాలను అప్ డేట్ చేస్తూ వెళుతోంది. ఇటీవల యాక్టివా 125, ఎస్ 125, ఎస్ పీ 160 లను ఆధునికరించింది. తాజాగా యూనికార్నా్ కూడా అప్ డేట్ చేసి విడుదల చేసింది. పాత మోడల్ తో పోల్చితే కొత్త మోడల్ ధర రూ.8 వేలు ఎక్కువగా ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి