AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ISI Mark: ఇకనుంచి వాటికి ISI మార్క్.. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్ణయం..

ISI Mark: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సోయా ఉత్పత్తులపై ISI గుర్తును ఉపయోగించాలని తయారీదారులను కోరింది. సామాన్యులలో సోయా ఉత్పత్తుల వినియోగం

ISI Mark: ఇకనుంచి వాటికి ISI మార్క్.. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్ణయం..
Soy Products
uppula Raju
|

Updated on: Mar 11, 2022 | 9:51 AM

Share

ISI Mark: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సోయా ఉత్పత్తులపై ISI గుర్తును ఉపయోగించాలని తయారీదారులను కోరింది. సామాన్యులలో సోయా ఉత్పత్తుల వినియోగం పెరుగుతున్న దృష్ట్యా ISI మార్క్‌ కచ్చితమని పేర్కొంది. ఒక అధికారిక ప్రకటనలో సోయా ఉత్పత్తి తయారీదారులు నాణ్యత రుజువు తీసుకున్న తర్వాత ISI గుర్తును ఉపయోగించడం ప్రారంభించాలని తెలిపింది. సోయా ఉత్పత్తులకు సంబంధించి భారతీయ ప్రమాణాలు అనే అంశంపై నిర్వహించిన వెబ్‌నార్‌లో బీఐఎస్ అధికారులు మాట్లాడుతూ.. సోయాబీన్‌తో తయారైన వివిధ ఉత్పత్తులకు ప్రజల్లో ఆదరణ నిరంతరం పెరుగుతోందని తెలిపారు. ఈ పరిస్థితిలో ఈ ఉత్పత్తుల ప్రమాణాన్ని నిర్ధారించడం అవసరమని చెప్పారు. సోయా ఉత్పత్తుల నాణ్యతను నిర్ధారించడమే కాకుండా వాటి భౌతిక, రసాయన, బ్యాక్టీరియాలాజికల్ ప్రమాణాలను నిర్వహించడానికి పరీక్షా పద్ధతులను ప్రామాణీకరించడం అవసరం అని BIS తెలిపింది. సోయా ఫ్లోర్, సోయా మిల్క్, సోయా నట్స్, సోయా బటర్ వంటి ఉత్పత్తులకు ఇది ఇప్పటికే భారతీయ ప్రమాణాలను జారీ చేసింది. ఇక మిగిలిన కొత్త సోయా ఉత్పత్తులకు ప్రమాణాలను సిద్ధం చేసే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.

భారతదేశంలో ISI గుర్తు1955 నుంచి ప్రారంభమైంది. భారతదేశ జాతీయ ప్రమాణాల సంస్థ అయిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) దీనిని ధృవీకరిస్తుంది. ఈ సోయా ఉత్పత్తుల నాణ్యత, భద్రతను నిర్వహించడానికి భౌతిక, రసాయన, మైక్రోబయోలాజికల్ పారామితులు, వాటి పరీక్షా పద్ధతులు ప్రమాణీకరించారు. దీనివల్ల వినియోగదారులకు సురక్షితమైన సోయా ఉత్పత్తులు లభిస్తాయి. తద్వారా ప్రజారోగ్యం మెరుగుపడుతుంది. సోయా పిండి, సోయా పాలు, సోయా గింజలు, సోయా వెన్న వంటి ఉత్పత్తుల కోసం BIS ఏడు భారతీయ ప్రమాణాలను ప్రచురించింది. కొత్త సోయా ఉత్పత్తుల కోసం ప్రమాణాలను అభివృద్ధి చేసే పనిలో ఉంది.

Zodiac Signs: మార్చి 27 నుంచి ఈ 3 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!

ఈ జీవులు కళ్లు తెరిచే నిద్రపోతాయా.. శాస్త్రవేత్తల అధ్యయనంలో షాకింగ్‌ విషయాలు..

Cricketers: ఇతర మతాల అమ్మాయిలను ప్రేమించి పెళ్లిచేసుకున్న భారత క్రికెటర్లు వీరే..!