Sovereign gold bonds: బాండ్స్‌లో బంగారం సురక్షితమేనా..? అసలు విషయాలు తెలిస్తే షాక్..!
ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు బంగారం అనేది ఒక నమ్మకమైన పెట్టుబడి సాధనంగా ఉంది. ముఖ్యంగా భారతదేశంలోని అయితే ఎక్కువ మంది ప్రజలు బంగారాన్ని ఆభరణాలు కింద కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో దేశంలో బంగారం దిగుమతులు పెరిగాయి. ఈ దిగుమతులను తగ్గించడంతో పాటు పెట్టుబడిదారులకు సాయం చేసే కేంద్ర ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను లాంచ్ చేసింది. అయితే ఇలా బాండ్‌ల ద్వారా కొనుగోలు చేసిన బంగారం సురక్షితమేనా? అనే విషయం తెలుసుకుందాం.

గత కొన్ని సంవత్సరాలుగా బంగారం ధరల పెరుగుదల పెట్టుబడిదారుల్లో ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సావరిన్ గోల్డ్ బాండ్లపై పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా భారత ప్రభుత్వం సకాలంలో ఈ సొమ్ములు తిరిగి చెల్లించగలదా? అని ఆందోళనకు గురయ్యే వారు ఎక్కువ అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం 2015 నవంబర్‌లో సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్‌జీబీ) పథకాన్ని ప్రారంభించి గత సంవత్సరం దానిని నిలిపివేసింది. చౌకైన రుణ ఎంపికను సృష్టించడానికి ఒక సాధనంగా భావించిన ఆర్‌బీఐ ఒక గ్రాము బంగారం, దాని గుణిజాల విలువలతో ఎస్‌జీబీలను జారీ చేసింది. నవంబర్ 2015 నుంచి ఆర్‌బీఐ మొత్తం 67 విడతల ద్వారా 147 టన్నుల బంగారాన్ని జారీ చేసింది. ప్రభుత్వం ఎస్‌జీబీల ద్వారా దాదాపు రూ.72,000 కోట్లు సేకరించింది.
2015లో ఎస్‌జీబీ పథకం ప్రారంభించినప్పటి నుంచి బంగారం ధరలు 250 శాతం కంటే ఎక్కువ పెరిగి 1 గ్రాముకు రూ. 9,300కి చేరుకున్నాయి. ప్రస్తుత ధర ప్రకారం ఈ రోజు అన్ని బాండ్లను తిరిగి చెల్లిస్తే ప్రభుత్వం రూ. 1.2 లక్షల కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం పెద్దగా అనిపించవచ్చు. కానీ భారత ప్రభుత్వ మొత్తం రుణ బాధ్యతలు, వార్షిక బడ్జెట్‌తో పోలిస్తే మనం దీనిని చూసినప్పుడు ఇది చాలా తక్కువగా ఉంటుంది. మార్చి 31, 2025 నాటికి, భారతదేశానికి సంబంధించిన మొత్తం రుణ బాధ్యత రూ. 181.74 లక్షల కోట్లుగా ఉందని ప్రభుత్వ డేటాను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇందులో రూ. 1.2 లక్షల కోట్ల ఎస్‌జీబీలు అనేవి చాలా చిన్న విషయం. ఇప్పటివరకు ప్రభుత్వం 7 విడతల బాండ్లను పూర్తిగా తిరిగి చెల్లించింది. అలాగే 8వ విడతకు ముందస్తు మెచ్యూరిటీను కూడా అందించింది.
ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఎస్‌జీబీలను మెచ్యూర్ చేస్తారు. దీన్ని బట్టి ఈ బాండ్ల బాధ్యతను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని, అలాగే సకాలంలో చెల్లింపులు చేస్తోందని అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా పెరుగుతున్న బాధ్యతను సమతుల్యం చేయడానికి ప్రభుత్వం గోల్డ్ రిజర్వ్ ఫండ్‌ను కూడా సృష్టించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఈ నిధిలో రూ.3,552 కోట్లు జమ చేశారు. దీనిని 2025 ఆర్థిక సంవత్సరంలో సవరించిన బడ్జెట్‌లో రూ.28,605 కోట్లకు పెంచారు. అయితే ప్రభుత్వం అన్ని బాండ్లను ఒకేసారి రీడీమ్ చేయడం కుదరవు. చివరి విడత మెచ్యూరిటీ 2032లో ఉంటుంది. అంటే ప్రభుత్వం ఒకేసారి చెల్లింపు చేయాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల చెల్లింపును ప్లాన్ చేసుకోవడానికి తగినంత సమయం లభిస్తుంది. అయితే బంగారం ధరలు ఇలాగే పెరుగుతూ ఉంటే, ప్రభుత్వ మొత్తం బాధ్యత మరింత పెరగవచ్చు. కానీ అదే సమయంలో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని మనం మర్చిపోకూడదు.
2029 ఆర్థిక సంవత్సరం నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే భారతదేశ బాండ్ మార్కెట్ విలువ దాదాపు 2.7 లక్షల కోట్ల యూఎస్ డాలర్లు, అలాగే కార్పొరేట్ బాండ్ల పరిమాణం 600 బిలియన్ల డాలర్లకు చేరుకుంది. ఇలాంటి పరిస్థితిలో ఎస్‌జీబీల వంటి పరిమిత బాధ్యతలు దేశ ఆర్థిక స్థిరత్వంపై పెద్దగా ప్రభావం చూపదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి భారత ప్రభుత్వ చెల్లింపు ట్రాక్ రికార్డ్ నమ్మదగినదిగా ఉంది. అలాగే నిధుల నిర్మాణం బలంగా ఉంది. కాబట్టి గోల్డ్ రిజర్వ్ ఫండ్ వంటి చర్యలు ప్రమాదాన్ని సమతుల్యం చేస్తాయి. మీరు ఎస్‌జీబీలో పెట్టుబడి పెడితే ప్రస్తుత పరిస్థితిని బట్టి మీరు మీ మూలధనం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు భరోసా ఇస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..