E20 Petrol: E20 పెట్రోల్ వాడకంపై సోషల్ మీడియాలో పుకార్లు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
Is E20 Petrol Safe for Your Vehicle? విదేశాల నుంచి ముగిచమురు దిగుమతిని తగ్గించేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ20 పెట్రోల్‌పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఈ20 పెట్రోల్ వాడకం వల్ల చాలా వాహన ఇంజన్ పాడవుతుందని, ఇంజన్‌లో పురుగులు వస్తున్నయన్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఈ20 వినియోగంపై వాహనదారులకు స్పష్టం ఇచ్చిందిజ.

ఈ20 పెట్రోల్ అంటే.. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలపడం.. దీన్నే ఈ20 పెట్రోల్ అంటారు. సుమారు 80 శాతం ఇంధాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న భారత ప్రభుత్వం.. దీన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఇటీవల ఇథనాల్ మిక్స్‌డ్ పెట్రోల్‌ను అందుబాటులోకి తీసుకుచ్చింది. త్వరలో ఈ85 కూడా తీసుకొస్తామని ప్రకటించింది. అయితే ఈ20 వాడడం వల్ల వాహనాల ఇంజన్‌లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, మైలేజ్ తగ్గుతుందని సోషల్ మీడియాలో జురుగున్న ప్రచారాన్ని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. వాహనదారుల్లో ఉన్న అపోహలను తొలగించడానికి ప్రభుత్వం 10 పాయింట్లతో కూడిన వివరణను ఇచ్చింది. అవేంటో చూద్దాం
E20 పెట్రోల్‌పై ప్రభుత్వం ఇచ్చిన 10 వివరణలు
నీటి వినియోగం: అయితే ఇథనాల్ తయారీ కోసం భారీ మొత్తంలో వాటర్ అవసరమవుతుందని.. ఇప్పటికే నీటి కష్టాలు ఉన్న దేశంలో.. దీని వల్ల మరింత పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరగ్గా.. దీనిపై కేంద్ర క్లారిటీ ఇస్తూ.. ఒక లీటర్ ఇథనాల్ తయారీకి 10,000 లీటర్ల నీరు కావాలనే ప్రచారంలో నిజం లేదని.. లీటర్ ఇథనాల్‌కు కేవలం 3 నుండి 5 లీటర్ల శుద్ధి చేసిన నీరు మాత్రమే అవసరమవుతుంది తెలిపింది.
ఆహార భద్రత: అలాగే ఇథనాల్ తయారీకీ అధిక మొత్తంలో ధాన్యం కావాలనే ప్రచారాన్ని కూడా కేంద్ర ఖండిచింది. దేశ ఆహార అవసరాలు తీరిన తర్వాత మిగిలిన అదనపు బియ్యాన్ని మాత్రమే ఇథనాల్ తయారీకి వాడుతున్నామని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇథనాల్ తయారీలో మొక్కజొన్న వాటా 40 శాతానికి పైగా పెరిగింది. దీనికి వాటర్ కూడా చాల తగ్గు అవసరమవుతుందని తెలిపింది.
ప్రయోగం కాదు: E20 పెట్రోల్ అనేది ఇప్పుడే వాహనాలపై ప్రయోగిస్తున్నది కాదని.. ఇప్పటికే అమెరికా, బ్రెజిల్, కెనడా, థాయిలాండ్, జపాన్, యూరప్ దేశాల్లో దశాబ్దాలుగా ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను వాడుతున్నారని తెలిపింది.
మైలేజ్, పర్ఫార్మెన్స్: అయితే వాహన మైలేజ్, ఫర్ఫామెన్స్ తగ్గుతుందనే ఆరోపణలు కూడా కేంద్ర ఖండించింది. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం.. కార్లు, బైక్‌లు, భారీ వాహనాలపై టెస్ట్ చేయగా మైలేజ్‌లో ఎలాంటి పెద్ద మార్పులు లేవని, స్వల్ప మార్పు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది.
ఇంజిన్ భద్రత: E20 పెట్రోల్ వల్ల ఇంజిన్‌లు పాడవుతుందనే వాదనను కూడా కేంద్ర తోసిపుచ్చింది. అయితే, చాలా పాత వాహనాల్లోని కొన్ని రబ్బరు విడిభాగాలు మాత్రం కొంచెం త్వరగా పాడయ్యే అవకాశం ఉందని, వాటిని మార్చుకుంటే సరిపోతుందని క్లారిటీ ఇచ్చింది.ఇక కొత్త వచ్చే వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపింది.
వారంటీ, ఇన్సూరెన్స్: E20 పెట్రోల్ వాడితే బైక్ లేదా కార్ వారంటీ లేదా ఇన్సూరెన్స్ రద్దవుతుందనే ప్రచారాన్ని కూడా కేంద్ర ఖండించింది. కంపెనీలు ఆమోదించిన వాహనాలకు ఇన్సూరెన్స్, వారంటీలు యథావిధిగా స్పష్టం చేసింది.
కీటకాల బెడద: ఇథనాల్‌ను చక్కెరతో తయారు చేస్తారు కాబట్టి ట్యాంక్‌లోకి చీమలు, ఈగలు వస్తున్నాయన్న ప్రచారంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇథనాల్‌ను డిస్టిలేషన్ ప్రక్రియ ద్వారా తయారు చేయడం వల్ల అందులో చక్కెర అస్సలు మిగలదని తెలిపింది. ఇది పూర్తిగా పెట్రోల్ వినియోగానికి సరిపోతుందని పేర్కొంది.
సుప్రీంకోర్టు వివాదం: సుప్రీంకోర్టులో ప్రభుత్వం దీనిని ఒక ప్రయోగం అని చెప్పిందనే వార్తలు అబద్ధమని కేంద్రం తెలిపింది. కోర్టులో నడిచిన కేసు కేవలం ఇథనాల్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించింది మాత్రమేనని.. ఇంధన నాణ్యతకు సంబంధించింది కాదని స్పష్టం చేసింది.
ట్యాంకుల్లోకి నీరు చేరడం: E20 వల్ల పెట్రోల్ ట్యాంకుల్లోకి వాటర్ వస్తుందనేది కూడా అపోహ మాత్రమేనని.. ఆదునిక వాహనాల్లో, పెట్రోల్ బంకుల్లో నీరు చేరకుండా అన్ని రకాల భద్రతా ప్రమాణాలు ఉంటాయని చెప్పుకొచ్చింది.
చెరకు రసం వాడకం: పెట్రోల్‌లో నేరుగా చెరకు రసం కలుపుతున్నారనే వైరల్ వీడియోలు పూర్తిగా ఫేక్ అని.. ఇథనాల్ అనేది పారిశ్రామికంగా పులియబెట్టడం , డీహైడ్రేషన్ ప్రక్రియల ద్వారా తయారయ్యే ఒక రకమైన ఆల్కహాల్, దీన్ని సరపేట్‌గా తయారు చేస్తారని తెలిపింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
