IRCTC Tour: ఐఆర్‌సీటీసీ న్యూ ఇయర్ టూర్ ప్యాకేజీ.. డిసెంబర్ 29 నుంచి ప్రారంభం.. ఎక్కడెక్కడ అంటే..!
IRCTC Tour: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) 'న్యూ ఇయర్ పాండిచ్చేరి, తిరుపతి బాలాజీ దర్శన్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీలో..
IRCTC Tour: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ‘న్యూ ఇయర్ పాండిచ్చేరి, తిరుపతి బాలాజీ దర్శన్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీలో 4 రాత్రులు/5 పగళ్లు ఉంటాయి. ఈ రైలు ప్రయాణం కోల్‌కతా, తిరుపతి, చెన్నై, కాంచీపురం, పాండిచ్చేరి మరియు మహాబలిపురంలను కవర్ చేస్తుంది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ప్రకారం.. పర్యటన డిసెంబర్ 29, 2021 నుంచి ప్రారంభమై జనవరి 2, 2022 వరకు కొనసాగనుంది. ఈ ప్యాకేజీలో కేవలం 20 మంది పర్యాటకులు మాత్రమే ఉంటారు. కోల్‌కతా నుండి ప్రారంభమయ్యే ఈ యాత్రలో పెద్దలకు రూ.45180, జంట పెద్దలకు, ఒక్కో వ్యక్తికి రూ. 34,710 నిర్ణయించారు. అయితే, ముగ్గురు పెద్దలకు టిక్కెట్లు బుక్ చేసుకునే వారికి ఒక్కో వ్యక్తికి దాదాపు రూ. 32,760 ధర ఉంటుంది. అదనపు బెడ్ లేకుండా పిల్లలకి (2 సంవత్సరాల నుండి 4 సంవత్సరాల వరకు) ఛార్జీ రూ. 19,560 కాగా, అదనపు బెడ్ ఉన్న 5 సంవత్సరాల నుండి 11 సంవత్సరాల మధ్య పిల్లలకు ధర రూ. 19,810.
ప్యాకేజీ వివరాలు.. కోల్‌కతా నుండి ప్రారంభమయ్యే ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీలో కోల్‌కతా-చెన్నై, చెన్నై-కోల్‌కతాకు విమాన టిక్కెట్‌తో సహా, అన్ని సందర్శనా స్థలాలు, డీలక్స్ కేటగిరీ, అల్పాహారం, రాత్రి భోజనం, వసతి, ప్రయాణ ప్రణాళిక ప్రకారం.. సందర్శనా స్థలాలు, ప్రయాణ బీమా సౌకర్యం, తిరుపతి బాలాజీ వీఐపీ దర్శనం టికెట్ ఉంటాయి.
కోవిడ్-19 మార్గదర్శకాలు: కోవిడ్ నేపథ్యంలో పర్యాటకులు కరోనా నిబంధనలు పాటించాలని ఐఆర్‌సీటీసీ తెలిపింది. ఇందులో ప్రయాణికులందరికీ థర్మల్ స్క్రీనింగ్ ఉంటుంది. ఇ-రిజిస్ట్రేషన్ అవసరం, అయితే COVIDకి సంబంధించిన నియమాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయబడతాయని తెలిపింది.
గుర్తుంచుకోవలసిన విషయాలు: ప్రయాణీకులందరూ తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రయాణికులు 48 గంటలలోపు తీసుకున్న RT-PCR నెగిటివ్ టెస్ట్ రిపోర్ట్‌ను తీసుకెళ్లాలి. RT-PCR రిపోర్టు లేకుంటే తిరిగి వెనక్కి పంపిస్తారు.
ఇవి కూడా చదవండి: