iPhone 14: అదిరిపోయే ఆఫర్.. ఐఫోన్‌ 14పై భారీ డిస్కౌంట్‌.. కొద్దిరోజులు మాత్రమే!

యాపిల్‌ గతేడాది విడుదల చేసిన ఐఫోన్‌ 14 సిరీస్‌ ఫోన్లపై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. అవును మీరు విన్నది నిజమే..

iPhone 14: అదిరిపోయే ఆఫర్.. ఐఫోన్‌ 14పై భారీ డిస్కౌంట్‌.. కొద్దిరోజులు మాత్రమే!
Iphone 14
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 13, 2023 | 7:57 PM

యాపిల్‌ గతేడాది విడుదల చేసిన ఐఫోన్‌ 14 సిరీస్‌ ఫోన్లపై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. అవును మీరు విన్నది నిజమే. వాలంటైన్స్‌ వీక్‌ సందర్భంగా ఐఫోన్‌ 14, ఐఫోన్‌ 14 ప్లస్‌, ఐఫోన్‌ 14 ప్రో, ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్‌ మోడళ్లపై యాపిల్‌ థర్డ్‌ పార్టీ అధీకృత రిటైల్‌ సెల్లర్‌ iVenus పరిమిత కాలపు ఆఫర్‌ను ప్రకటించింది. ఐఫోన్‌ 14 మోడల్‌పై బ్యాంక్‌ ఆఫర్‌, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌, ఎక్స్ఛేంజ్‌ బోనస్‌ మొదలైనవన్నీ కలుపుకొంటే గరిష్ఠంగా 42,000 రూపాయల డిస్కౌంట్‌ లభిస్తుందని ఆ సంస్థ పేర్కొంది.

ఐఫోన్‌ 14 ధరను 79,990 రూపాయలుగా యాపిల్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఫోన్‌ అన్ని ఆఫర్లూ పోనూ 37,900 రూపాయలకే లభిస్తుందని ఐవీనస్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది. ఇందులో ఐవీనస్‌ స్టోర్‌ 8 వేల డిస్కౌంట్‌ అందిస్తుండగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కార్డ్స్‌పై 4వేల క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. పాత ఫోన్‌తో పాటు పాత ఫోన్‌ మార్చుకోవడం ద్వారా ఇచ్చే ఎక్స్ఛేంజ్‌ బోనస్‌ కలిపితే 30 వేల రూపాయల వరకు డిస్కౌంట్‌ పొందొచ్చని వెబ్‌సైట్‌ పేర్కొంది. ఇలా అన్ని ఆఫర్లూ కలుపుకొంటే 42వేల రూపాయలు అవుతుందని ఐవీనస్‌ పేర్కొంది.

ఇక 89,990 రూపాయల ధర కలిగిన ఐఫోన్‌ 14 ప్లస్‌ సైతం అన్ని ఆఫర్లతో కలిపి 46,990కే లభిస్తుందని ఐవీనస్‌ తెలిపింది. ఈ ఫోన్‌పై ఐవీఎన్‌ 9వేల రూపాయల డిస్కౌంట్‌ అందిస్తుండగా.. ఐఫోన్‌ 14 తరహాలోనే మిగిలిన ఆఫర్లు వర్తిస్తాయి. ఐఫోన్‌ 13 సైతం అన్ని ఆఫర్లన్నీ కలిపి 30,900 రూపాయలకే అందిస్తామని ఐవీస్‌ పేర్కొంది.

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో