Post Office: ఈ పథకంలో ప్రతీ నెలా రూ.10 వేలు డిపాజిట్ చేస్తే.. రూ.16 లక్షల వరకు పొందొచ్చు!
ఉద్యోగం చేస్తున్నప్పుడే రిటైర్మెంట్ ప్లాన్స్‌ను పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటే.. వృద్దాప్యంలో ఎలాంటి సమస్యలు లేకుండా జీవితాన్ని కూల్‌గా కంప్లీట్ చేయవచ్చు.
ఉద్యోగం చేస్తున్నప్పుడే రిటైర్మెంట్ ప్లాన్స్‌ను పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటే.. వృద్దాప్యంలో ఎలాంటి సమస్యలు లేకుండా జీవితాన్ని కూల్‌గా కంప్లీట్ చేయవచ్చు. ఇక బ్యాంకుల మాదిరిగానే తక్కువ పెట్టుబడి అధిక రాబడిని అందజేస్తున్నాయి కొన్ని పోస్టాఫీస్ పధకాలు. అందులో ఒకటి రికరింగ్ డిపాజిట్.
ఈ పధకంలో మీరు ప్రతీ నెలా రూ.10 వేలు డిపాజిట్ చేస్తే.. మెచ్యూరిటీ సమయానికి రూ. 16 లక్షల వరకు పొందొచ్చు. రికరింగ్ డిపాజిట్‌లో డిపాజిట్ చేసిన సొమ్ముపై మీకు దాదాపు 5.8% వడ్డీ లభిస్తుంది. కాంపౌండింగ్ మొత్తం ద్వారా ఈ వడ్డీ ప్రతి మూడో నెలలకి యాడ్ అవుతుంది. దీనిపై వచ్చే రిటర్న్స్ మీదకు మీకు ఎలాంటి రిస్క్ ఉండదు. కేవలం రూ. 100తో ఈ ఖాతాను తెరవచ్చు. అలాగే ఇందులో మీరు ఎంతైనా డిపాజిట్ చేయవచ్చు. ఇక ఈ పథకంలో 10 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలి.
ప్రతీ నెలా రూ. 10 వేలు పెట్టుబడి.. 10 సంవత్సరాల పాటు చేస్తే.. లెక్క ప్రకారం ఏడాదికి లక్షా 20 వేల చొప్పున.. 10 ఏళ్లకు రూ. 12 లక్షలు అవుతుంది. ఇక ఈ మొత్తానికి 5.8 శాతం వడ్డీ రేటుతో మీరు రూ.16,15,721 పొందొచ్చు. ఒకవేళ మీరు రూ. 10 వేలు డిపాజిట్ చేయలేకపోయినా.. నెలకు రూ. 3 వేలు పెట్టుబడి పెడితే.. 10 సంవత్సరాలలో 5 లక్షలకు వరకు సంపాదించవచ్చు.