iPhone 13 series: త్వరలో యాపిల్ నుంచి ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు.. అదిరిపోయే ఫీచర్స్..!
iPhone 13 series: యాపిల్ కంపెనీ ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంటుంది. యాపిల్ నుంచి ఇప్పటికే విడుదలైన ఐఫోన్ 12 సిరీస్ స్మార్ట్ ఫోన్‌ల అమ్మకాలు జోరుగా..
iPhone 13 series: యాపిల్ కంపెనీ ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంటుంది. యాపిల్ నుంచి ఇప్పటికే విడుదలైన ఐఫోన్ 12 సిరీస్ స్మార్ట్ ఫోన్‌ల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. యాపిల్ నుంచి ఈ ఏడాది ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్ ఫోన్ కూడా మార్కెట్లో రానున్నాయి. ఈ సిరీస్ మొబైల్ ప్యానెల్ డిజైన్, మోడళ్లకు సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. కొత్త రిసీస్ ఫోన్లు ప్రస్తుతం ఉన్న ఐఫోన్ 12 సిరీస్ ఎక్స్‌టీరియల్ డిజైన్ మాదిరిగానే ఉంటాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఐఫోన్ 13లో వినియోగదారులను మరింతగా ఆకర్షించే కొన్ని అప్‌డేట్స్ ఫీచర్లు ఉన్నాయి. నాన్ డిజైన్, ఇన్ డిస్‌ప్లే, ఫింగర్ ప్రింట్, స్కానర్, పోర్ట్‌లెస్ ఛార్జింగ్ వంటి సరికొత్త ఫీచర్లతో వీటిని రూపొందించనున్నారు. అయితే గత సిరీస్‌తో పోలిస్తే ఐఫోన్ 13 ఫోన్లలో మెరుగైన కెమెరా లెన్స్ ఉంటాయి. లెన్స్ నాణ్యతను యాపిల్ అభివృద్ధి చేసింది. 120Hz LTPO టచ్ స్క్రీన్ ప్యానెల్, మెరుగైన బ్యాటరీ లైఫ్ వీటి ఉన్నాయి. యాపిల్ ఐఫోన్ 13 సిరీస్‌లో మొత్తం నాలుగు ఫోన్లను విడుదల చేయనున్నారు. మామూలుగా ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ బడ్జెట్ ఫోన్, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ వంటి మోడళ్లను సంస్థ అభివృద్ధి చేస్తోంది. ఐఫోన్ 13 స్మార్ట్‌ఫోన్లు 5.4 అంగుళాలు, 6.1 అంగుళాలు, 6.7 అంగుళాల స్క్రీన్‌తో రానున్నాయి.
అదిరిపోయే ఫీచర్లు
యాపిల్ మొదటిసారి ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో ఐఫోన్ 13 స్మార్ట్‌ఫోన్లను తయారు చేసింది. సిరీస్‌లోని ప్రో లైనప్ వేరియంట్లు హై ఎండ్ LTPO స్క్రీన్‌తో రానున్నాయి. ఈ అత్యాధునిక LTPO టెక్నాలజీ ఐఫోన్ 13కు అదనపు బలంగా చెప్పుకోవచ్చు. ఇది ఫోన్ల బ్యాటరీ వినియోగాన్ని తగ్గిస్తుంది. వీటి డిస్‌ప్లేలు 120Hz రిఫ్రెష్ రేటుతో పనిచేస్తాయి.
విడుదల ఎప్పుడు?
యాపిల్ కంపెనీ వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌ను జూన్ 7 నుంచి జూన్ 11 వరకు వర్చువల్ విధానంలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల్లోనే ఐఫోన్ 13 సిరీస్ గురించి మరిన్ని వివరాలను సంస్థ ప్రకటించే అవకాశం ఉంది. ఈ సంవత్సరం సెప్టెంబర్ చివర్లో కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. వీటి ధరలు రూ.69,990 నుంచి 1,49,990 వరకు ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి
ఇవీ చదవండి: BSNL Prepaid Plan: అద్భుతమైన ఆఫర్.. రూ. 397కే ఏడాది పాటు వ్యాలిడిటీతో బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్లు