BSNL Prepaid Plan: అద్భుతమైన ఆఫర్‌.. రూ. 397కే ఏడాది పాటు వ్యాలిడిటీతో బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్లు

BSNL Prepaid Plan: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (BSNL) అతి తక్కువ ధరలకే ప్రీపెయిడ్‌ ప్లాన్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ విభాగంలో....

BSNL Prepaid Plan: అద్భుతమైన ఆఫర్‌.. రూ. 397కే ఏడాది పాటు వ్యాలిడిటీతో బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్లు
Bsnl
Follow us
Subhash Goud

|

Updated on: Apr 24, 2021 | 12:42 PM

BSNL Prepaid Plan: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (BSNL) అతి తక్కువ ధరలకే ప్రీపెయిడ్‌ ప్లాన్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ విభాగంలో ఇతర టెలికాం సంస్థలకు సంస్థ పోటీ ఇస్తోంది. కేవలం రూ.397కే ఏడాది వ్యాలిడిటీ ప్లాన్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇంత తక్కువ ధరలో మరే ఇతర టెలికాం సంస్థ ఏడాది పాటు వ్యాలిడిటీ ఇవ్వడం లేదు. అయితే ఈ ప్లాన్‌ కింద లభించే కాలింగ్, డేటా ప్రయోజనాలు ఏడాది పాటు అందుబాటులో ఉండవు. ఈ ప్రయోజనాలు 60 రోజుల వరకు మాత్రమే వర్తిస్తాయి. మీ సిమ్‌ యాక్టివ్‌లో ఉంచుకోవడానికి నెలనెల రీఛార్జ్‌ చేసే సమస్యలు తప్పుతాయి. గతంలో ఈ ప్రీపెయిడ్‌ ప్లాన్‌ రూ.365కే అందుబాటులో ఉండేది. దీనిని తాజాగా రూ.397కు సవరించింది.

బీఎస్ఎన్ఎల్ రూ .397 ప్రీపెయిడ్ ప్లాన్

బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.397 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ కింద వినియోగదారులకు ప్రతి రోజు 2జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. అయితే ప్లాన్‌ వ్యాలిడిటీ 365 రోజులైనప్పటికీ ప్లాన్‌ ప్రయోజనాలు మాత్రం 60 రోజులకే అందుబాటులో ఉంటాయి. మొదటి రీఛార్జ్‌ చేసుకునే కస్టమర్లకు ఉచిత పర్సనలైజ్డ్‌ రింగ్‌ బ్యాక్‌ టోన్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 2జీబీ రోజువారీ హైస్పీడ్‌ డేటా లభిస్తుంది. ఆ తర్వాత డేటా స్పీడ్‌ 80 కేబీపీఎస్‌కు తగ్గుతుంది. అయితే ఇతర టెలికాం సంస్థలు ఏడాది వ్యాలిడిటీతో అందిస్తున్న ప్రయోజనాలు ఎయిర్‌టెల్‌, జియో, వొడాఫోన్‌-ఐడియా కూడా 365 రోజుల వ్యాలిడిటీతో వచ్చే వార్షిక ప్రీపెయిడ్‌ ప్లాన్‌లను అందిస్తున్నాయి. అయితే ఈ ప్లాన్‌ల ప్రయోజనాలు ఏడాది పాటు లభిస్తాయి. అంటే వీటితో 2జీబీ రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్‌, 100 ఎస్‌ఎంఎస్‌లు ఏడాది పాటు అందిస్తాయి. అదనంగా స్ట్రీమింగ్‌ డివైజ్‌లకు ఉచిత మెంబర్‌షిప్‌ కూడా అందిస్తు్న్నాయి.

ఎయిల్‌టెల్‌ రూ. 2498 ప్రీపెయిడ్ ప్లాన్

ఎయిర్‌టెల్‌ రూ.2,498 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్‌ కింద రోజుకు 2 జీబీ డేటా, అపరిమిత కాలింగ్‌, 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్‌ 365 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది.

జియో రూ.2,399 ప్రీపెయిడ్‌ ప్లాన్‌

జియో రూ.2,399 ప్లాన్‌తో ఏడాది పాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ తోపాటు 2జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌ల ప్రయోజనాలను అందిస్తుంది. అదనంగా జియో యాప్స్‌కు కాంప్లిమెంటరీ సబ్‌​స్క్రిప్షన్​ ఇస్తుంది.

వొడాఫోన్‌-ఐడియా రూ.2,595 ప్రీపెయిడ్‌ ప్లాన్‌

వొడాఫోన్‌-ఐడియా ప్రీపెయిడ్‌ ప్లాన్‌తో ఏడాది పాటు 2జీబీ రోజువారీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ ప్రయోజనాలు లభిస్తాయి. వీటితో పాటు వారాంతపు డేటా రోల్‌ఓవర్‌ డేటా వంటివి పొందవచ్చు. ఈ ప్లాన్‌తో ప్రీమియం జీ5 సబ్​స్క్రిప్షన్, వి మూవీస్‌ టీవీ వంటి వాటికి యాక్సెస్‌ లభిస్తుంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.1,999 ప్రీపెయిడ్‌ ప్లాన్‌

అలాగే బీఎస్‌ఎన్‌ఎల్‌లో రూ.1,999 కు వార్షిక ప్రీపెయిడ్‌ ప్లాన్‌ అందిస్తుంది. ఈ వార్షిక ప్రీపెయిడ్‌ ప్లాన్‌ కింద రూ.3జీబీ రోజువారీ డేటాతో పాటు అపరిమిత కాలింగ్‌, 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్‌ రూ.365 రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. 60 రోజుల పాటు బీఎస్‌ఎన్‌ఎల్‌ టీవీ కంటెంట్‌తో పాటు ఏడాది పాటు ఎరోస్‌నౌ ఓటీటీ ప్రయోజనాలను ఇస్తుంది. ప్రతి రోజు 3జీబీ డేటా అయిపోయిన తర్వాత డేటా స్పీడ్‌ 80 కేబీపీఎస్‌కు తగ్గుతుంది.

ఇవీ చదవండి: SBI Account: ఎస్‌బీఐ అకౌంట్‌ తీసుకోవడం మరింత సులభం.. ఇంట్లో ఉండే ఖాతా తెరవవచ్చు.. ఎలాగంటే..!

Gas Cylinder: మీరు గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేస్తున్నారా..? మీకో బంపర్‌ ఆఫర్‌.. రూ.800 వరకు క్యాష్‌బ్యాక్‌

Ola Electric Scooter: ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. 18 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్‌.. మైలేజీ ఎంతంటే..?

ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..